
టాలీవుడ్‌కు మరో కొత్తందం రాబోతోంది. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కొత్త మలుపు’లో భైరవి ఆర్థ్యా హీరోయిన్. తనకు ఇష్టమైన సినీపరిశ్రమ టాలీవుడ్లోనే తెరంగేట్రం చేయడం ఎంతో సంతోషంగా
ఉందంటున్న భైరవి.. చెప్పిన మరిన్ని ముచ్చట్లు..!
‘‘అస్సాంలో పుట్టిన నాకు.. చిన్నతనం నుంచి సినిమా, నటన ఎంతో ఇష్టం. టాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగా. హీరోయిన్ అవ్వాలనుకున్నా’’
‘‘ఓ వైపు చదువుతూనే సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ ఇచ్చా. టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలన్న మూడేళ్ల ప్రయత్నం ఇప్పుడు ఫలించింది’’
టాలీవుడ్‌కు రావాలని ముందుగానే తెలుగు నేర్చుకున్నా. తెలుగువారితో మాట్లాడుతూ భాషపై పట్టు సాధించా. నటనలో శిక్షణ తీసుకున్నా’’
‘‘ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్ర నాది. నేపథ్యమంతా కొనసీమలో ఉండటంతో ఆ యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది’’
‘‘అచ్చం తెలుగమ్మాయిలా కనిపించడం కోసం షూటింగ్‌కు నెల ముందే కొనసీమకు వెళ్లా. అక్కడి లైఫ్‌స్టైల్, డ్రెస్సింగ్, యాస అన్నీ నేర్చుకున్నా’’
‘‘హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చికెన్ దమ్ బిర్యానీ. ఆ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ వాతావరణం, ఆతిథ్యం బాగా నచ్చాయి’’
‘‘టాలీవుడ్ హీరోల్లో పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు ఇష్టం. హీరోయిన్లలో రష్మిక మందనా, సమంత ఎంతగానో అభిమానిస్తా’’
శ్రద్ధాదాస్.. సోషల్‌మీడియాలో భలే క్రేజ్