
మరణించిన వారు పుట్టక తప్పదు పుట్టిన వారు మరణించక తప్పదు అనే నానుడి అందరికీ తెలిసిందే. జనన మరణాలు అనేవి ప్రతి ఒకరి మదిలో ఒక జవాబు లేని ప్రశ్నలాంటివి. చాలా మందిని వీటికి సంబంధించిన అనేక సందేహాలు
వెంటాడుతాయి. ముఖ్యంగా కొందరు ఏదైనా చెడు జరుగుతే ఏం చేద్దాం.. నా తల రాత ఇలా ఉంది అంటూ ఉంటారు.
ఆ భగవంతుడు నా తల రాతను అలా రాశాడు అంటూ చెప్పుకొస్తారు. మరికొంత మంది ఎవరైనా చనిపోతే చాలు తన ఆయువు అక్కడి వరకే ఉంది. తన తలరాతలో ఇక్కడి వరకే బతకాలని రాసిపెట్టి ఉందేమో అంటారు. అంటే మనం ఎప్పుడు చనిపోతాం అనేది కూడా మన తలరాతలో ఉంటుందా? అంటే కొంత మంది అవును అనే అంటున్నారు.
చనిపోయే తేదీకూడా తల రాతలో రాసి పెట్టి ఉంటుందని కొందరు చెప్పుకొస్తే, మరికొంత మంది మాత్రం ఇది ఒక మూఢ నమ్మకం అంటూ కొట్టిపారుస్తుంటారు. అయితే కర్మసిద్ధాంతం, నమ్మకాల ప్రకారం మరణ సమయం అనేది పూర్వ జన్మల కర్మలు లేదా భగవంతుని పై ఆధారపడి ఉంటుంది. అది ముందే నిర్ణయించబడుతుంది. తల రాతలో కూడా ఇది ముందే రాసి ఉంటుందని చెబుతున్నారు కొందరు పండితులు.
ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు మానవుని ఆయువు ముందే నిర్ణయించబడుతుంది చెబుతుంటాయి. అయితే దీనిపై మాత్రం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువలన కొందరు వీటిని మూఢనమ్మకంగా కొట్టి వేస్తుంటారు. ఒక వ్యక్తి మరణం అనేది వారు జీవించే విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొస్తుంటారు.
తీసుకునే ఆహారం చేసే పనులు, ఆరోగ్యం, వంటి వాటిపై మాత్రమే ఒక వ్యక్తి మరణం అనేది ఆధారపడి ఉంటుంది. తన ఆయువును ఒక వ్యక్తి తన చేతులతో తానే నిర్ణయించుకుంటాడని, మరి కొందరు వాదిస్తుంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల అభిప్రాయం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరిచలేదని పాఠకులు గమనించాలి.