
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ (Nara Lokesh)ను నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు నారా లోకేష్‌కు చింతకాయల విజయ్ (Chintakayala Vijay), సానా సతీష్ (Sana Satish), భాష్యం రామకృష్ణ (Bhashyam Ramakrishna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాజ్యసభలో రాష్ట్ర ప్రజల వాణిని సమర్థంగా వినిపించాలని, కేంద్రం–రాష్ట్రం మధ్య వారధిగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన సభ్యులకు సూచించారు.