
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తమ 50వ స్వర్ణోత్సవ వేడుకల (Golden Jubilee Celebrations) సందర్భంగా 'హ్యూస్టన్ ఐడల్' (Houston Idol) పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గానం , నృత్యంలో తమ
ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. పోటీ వివరాలు.. తేదీ: జూన్ 27, 2026 సమయం: ఉదయం 10 AM నుండి రాత్రి 10 PM వరకు వేదిక: ఐరీన్ స్టెర్న్ కమ్యూనిటీ సెంటర్ (6920 ఫుల్షీర్ కేటీ రోడ్, ఫుల్షీర్, TX 77441) పోటీ విభాగాలు.. ఈ పోటీలు సోలో సింగింగ్, సోలో డాన్స్ , గ్రూప్ డాన్స్ విభాగాలలో జరుగుతాయి. వయస్సును బట్టి సబ్ జూనియర్ (8-13 ఏళ్లు), జూనియర్ (14-19 ఏళ్లు), సీనియర్ (20 ఏళ్లు & పైన) విభాగాలను నిర్ణయించారు. విజేతలు ఆగస్టు 8, 2026న జరిగే ప్రధాన వేడుకల్లో లైవ్ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారు. రిజిస్ట్రేషన్ వివరాలు.. రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక్కో పార్టిసిపెంట్‌కు $30. చివరి తేదీ: జూన్ 15, 2026. ఆసక్తి గల వారు tca50.org వెబ్సైట్ ద్వారా లేదా QR కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చు.