.webp)
బోల్డ్ లుక్‌లో షాక్ ఇచ్చిన తేజస్వి మడివాడ!
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ మరోసారి తన బోల్డ్ లుక్ తో నెట్టింట షాక్ ఇచ్చింది. dance has entered my life again అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్ లో నాలుగు ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
.webp)
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ మరోసారి తన బోల్డ్ లుక్ తో నెట్టింట షాక్ ఇచ్చింది. dance has entered my life again అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్ లో నాలుగు ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది.

డ్యాన్సర్ నైనిక (Nainika) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్
యూట్యూబ్‌లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్‌పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1

చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు తన్మయత్వంతో చిందులేసిన కుర్రాడు.. కళ్లుచెదిరే ఫైట్లు, కళ్లప్పగించి చూసే డ్యాన్సులతో వెండితెరకు వాయువేగాన్ని పరిచయం చేసిన అంజనీపుత్రుడు.. కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి బాక్సులు బద్దలుకొట్టిన స్టారాధిస్టారుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి ఎనలేని సేవలందించిన పద్మవిభూషణుడు.. ఏడు పదుల వయసులోనూ అభిమానుల హృదయాలను ఏలుతున్న చిరంజీవుడు.. మెగాస్టార్ చిరంజీవి! నేడు ఆయన 71వ జన్మదినోత్సవం. అభిమానులకు పట్టలేని సంబరం. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం(Megastar Chiranjeevi 71st Birth day). చిరంజీవి అనగానే గుర్తొచ్చేది.. ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది ఒకటుంది. అదేంటో అందరికీ తెలుసు. అవును..! అది తనకు మాత్రమే సాధ్యమనిపించే డ్యాన్స్. చిరు డ్యాన్స్‌లో ఓ ఊపు ఉంటుందబ్బా అంటారు 90's కిడ్స్ (90's kids). ఇక జెన్‌జీ(Gen-Z) కుర్రాళ్లేమో బాస్ స్టెప్పేస్తే ఆ గ్రేసే వేరు బ్రో అంటారు. అందువల్లేనేమో తరాలకు అతీతంగా అందరూ చిరు డ్యాన్సులకు కనెక్టవుతుంటారు. చిరంజీవి పాట ఎక్కడ వినిపించినా, అందులోని లిరిక్సే కాదు, ఆయన వేసిన స్టెప్పులు కూడా ఇట్టే గుర్తొస్తాయి. 90's కిడ్స్‌కు పాటలు వినాలంటే ఒకప్పుడు రేడియో, ఆ తరువాత టేప్ రికార్డర్, వాక్‌మ్యాన్, సీడీ ప్లేయర్, యూట్యూబ్, స్పాటిఫై.. ఇలా ఎన్నో మారాయి. కానీ, వాటిలో చిరంజీవి పాటలను వింటూ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. అందుకే చిరంజీవి పాటలంటే వారికి ఓ అందమైన జ్ఞాపకం. ఎక్కడైనా 90's కిడ్స్ రీయూనియన్ పార్టీ జరుగుతోందనుకోండి. అందులోకి వెళ్లి చూస్తే చిరంజీవి పాటలతో టాప్ లేచిపోతుంటుంది. ‘జీ.. ఏ.. ఎన్.. జీ.. గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్.. గ్యాంగ్ లీడర్’(Gang Leader) అని ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం గట్టిగా అరిచేస్తుంటారు. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బ..’ (Jagadekaveerudu Atilokasundari) అని తమ ఊహల్లోని అతిలోక సుందరిని ఊహించుకుంటూ లయబద్ధంగా స్టెప్పులేస్తుంటారు. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి

బుల్లితెరపై త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ పేర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. సీరియల్ తారల నుంచి సినిమా హీరోహీరోయిన్లు, ఇన్ స్టా ఇన్ల్ఫుయేన్సర్స్ సైతం హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోక్ డ్యాన్సర్లు శ్వర్ సాయి, మాధురి రాథోడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, రివ్యూయర్ ఆది రెడ్డి కూడా వీరి ఎంట్రీపై తన అభిప్రాయాలను వ్యక్తపరచడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల రెండు రోజులుగా వీరిద్దరి పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత వివాదంలో ఇద్దరి పేర్లు వార్తలలో నిలవగా.. ఇప్పుడు వీరి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షో ప్రతి సీజన్లోనూ వివాదాలు , లేదా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే కాంబినేషన్లను లేదా వైరల్ కంటెస్టెంట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ చుట్టూ ముసురుకున్న కుటుంబ వివాదం, సోషల్ మీడియా వ్యాఖ్యలు, మీడియాలో వచ్చిన వార్తలు విపరీతమైన వ్యూస్‌ను, పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో టీఆర్పీ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ క్రేజ్ ఉన్న వీరిని సంప్రదించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాడు ఆదిరెడ్డి. గత సీజన్లలో కూడా వివాదాస్పదంగా మారిన ఇన్ఫ్లుయెన్సర్లకు, కాంట్రవర్సీ పెయిర్స్‌కు బిగ్‌బాస్ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా? బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరిని తీసుకురావాలనేది ఆర్గనైజర్స్ చేతిలోనే ఉంటుంది. అయితే ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు బిగ్‌బాస్ కంటెంట్ అండ్ మైండ్‌సెట్‌ను బట్టి సరిపోతుంటాయి. “ప్రమీల”, “రాతిరి రాతిరి” వంటి హిట్ పాటలతో వీరిద్దరికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు ఇటీవల

రీసెంట్ డేస్‌లో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్ ‘బాసింగా బలాలే’. ‘ఉత్తా చేతుల ఉంచను పిల్లా.. అటో డజను, ఇటో డజను గాజులు నీకేస్తా మల్లా..’ అంటూ ఈ హుషారైన సాంగ్‌తో మంచి ఫేస్ సంపాదించున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మరో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో ఓ ప్రైవేట్ రూమ్‌లో రాసలీలలు సాగిస్తూ.. తన భార్య శరణ్య చేతికి చిక్కాడు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈశ్వర్ సాయి.. మాధురి తో ఇప్పటికే పలు ఫోక్ సాంగ్స్‌లో నటించాడు. అలా వారి పరిచయం ఇలా ఇల్లీగల్ ఎఫైర్‌గా దారితీసినట్టు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపిస్తోంది.వీరిద్దరి వివాహేతర సంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, అయినా తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఈ ఇష్యు వేముల వాడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దాంతో పాటే ఈ వీడియో కూడా అన్ని ప్లాట్ ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్లు మరిచిన వైనం మంత్రి మందలించినా మారని తీరు రాత్రి అయితే జూనియర్ డాక్టర్లే దిక్కు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్ బాట పడుతున్న రోగులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ప్రాణం పోయాల్సిన వారు బాధ్యతను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు రావాల్సిన ఆసుపత్రి వైద్యాధికారి 10.30 తర్వాత వస్తుండడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ హాజరుతోపాటు మాన్యువల్ రిజిస్టర్లలో సంతకం చేయాల్సి ఉండగా రెండేళ్లుగా దాని ఊసే ఎత్తడం లేదు. కేవలం పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే రిజిస్టర్లు పెడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కఠినంగా వ్యవహరించకపోవడం, రిజిస్టర్లను మెయింటైన్ చేయకపోవడంతోనే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలకూ ‘డోంట్ కేర్’ గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అటెండెన్స్, గవర్నెన్స్, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సదరు మీటింగ్‌కు ఉస్మానియా నుంచి ఎలాంటి రికార్డులూ తీసుకెళ్లలేదంటే వారి నిర్లక్ష్యం, బేఖాతరు అర్థమవుతుంది. ఆ సమావేశం తర్వాతైనా రికార్డులను పక్కాగా మెయింటెయిన్ చేయాలన్న సోయి అధికారుల్లో లోపించింది. పెద్ద ప్రమాదంతో వచ్చినా పట్టింపేదీ? ఉస్మానియా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీత ఉదంతం తేటతెల్లం చేసింది. నాంపల్లిలో నివాసం ఉండే సునీత గన్ ఫౌండ్రిలోని ఎస్బీఐ హౌస్ కీపింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 12న ఆబిడ్స్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీత తీవ్రంగా గాయపడింది. తీవ్ర

హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాకిచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులంతా పాల్గొని డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న తాజా వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూనియన్ నాయకులు చేసిన తప్పుల వల్ల సామాన్య డాన్సర్లకు అన్యాయం జరగకూడదని, ఫెడరేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న ప్రతి డాన్సర్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. డాన్సర్స్ యూనియన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను ఏమాత్రం లెక్కచేయకుండా సుమలత (Sumalatha) డాన్సర్లను రెచ్చగొట్టి ఫెడరేషన్‌ను ధిక్కరిస్తూ ఎన్నికలు నిర్వహించారు. వారి స్వేచ్ఛకు మేం భంగం కలిగించం కానీ, వారి కార్యవర్గ నిర్ణయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది. అలాగే జానీ మాస్టర్ (Jani Master)పై ఉన్న సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నాం. ఇది 23 యూనియన్ల ఏకాభిప్రాయ నిర్ణయం. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు విరాళంగా ఇచ్చిన మూడు లక్షల రూపాయలను తిరిగి ఆయనకే పంపించేస్తున్నాం’’ అని అనిల్ వల్లభనేని ప్రకటించారు. ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్ల పెంపులో 20 శాతం మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఇప్పటికే జీవో ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని వెంటనే ఫెడరేషన్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన నాన్-కోఆపరేషన్ కాల్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన 23 క్రాఫ్టుల అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు ఇచ్చిన లిఖితపూర్వక హామీని ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధించడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ వివాదానికి సంబంధించి జూలైలో డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఫెడరేషన్ జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ ప్రకటించినప్పటికీ, జూలై 19న చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్యవర్తిత్వంతో సస్పెన్షన్ తాత్కాలికంగా తొలగించబడింది. ఇదిలా ఉండగా, అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలు, ఆర్థిక అక్రమాలు మరియు నూతన ఎన్నికల నిర్వహణపై ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించి మద్దతును పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాతల మండలి ఇచ్చిన సలహాలను పక్కనపెట్టి నిబంధనలు దాటడంపై ఫెడరేషన్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల ద్వారా కొలువుదీరిన నూతన కార్యవర్గానికి ఎలాంటి సహకారం అందించబోమని తేల్చిచెప్పిన ఫెడరేషన్, సాధారణ డ్యాన్సర్లు తమను ఆశ్రయిస్తే మాత్రం పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగా జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ అమల్లోకి రావడంతో ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న సినిమాల షూటింగ్‌లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 23 క్రాఫ్టులకు చెందిన వర్కర్లు మరియు సాంకేతిక నిపుణులు ఆయన ప్రాజెక్టులకు సహకరించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు బడా నిర్మాతలు మరియు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ ఫెడరేషన్) గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్‌పై ఈ చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది.ఈ సమావేశంలో డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను కాదని, ఏకపక్షంగా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది.ఈ పరిణామాల నేపథ్యంలో, ఇకపై డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే, సామాన్య డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మిగతా 23 క్రాఫ్టులకు మాత్రం యథావిధిగా సహకారం కొనసాగుతుందని పేర్కొంది. అంతేకాకుండా, గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు ఇచ్చిన రూ. 3 లక్షల మొత్తాన్ని కూడా ఆయనకే తిరిగి పంపిస్తున్నట్లు వెల్లడించింది

సౌత్ లో లెజెండ్రీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శివ శంకర్ మాస్టర్ ఒకరు. భరత నాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్స్ తో ఆయనకి అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. సినిమాల్లో ఎక్కువగా ఆయన క్లాసికల్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించారు. ఎన్నో వందల పాటలకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ ఓ సాంగ్ కి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రంలోని ఈ ఐకానిక్ సాంగ్. చిరంజీవి, మాధవి చేత శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా నాగిని డ్యాన్స్ చేయించారు. అప్పట్లో ఈ సాంగ్ ఒక సంచలనం. శివ శంకర్ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు.. చిరు, మాధవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయితాయి. ఖైదీ చిత్రం చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో అరుంధతి ఒకటి. ఈ సినిమా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తీసుకువచ్చింది. ఈ మూవీలో భూం భూం భుజంగం దీత్తై తరంగం అనే పవర్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక సందర్భంలో ఈ పాట వస్తుంది. కథానాయిక అయిన అనుష్క, విలన్ సోనూసూద్ మధ్య ఒక సన్నివేశంలాగా సాగే పాట ఇది. ఈ పాటలో డ్యాన్స్ తో పాటు నటన కూడా చాలా కీలకం. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. 2003లో విడుదలైన తిరుడా తిరుడి చిత్రంలోది ఈ సాంగ్. మన్మథ రాసా సాంగ్ అప్పట్లో యువతని, మాస్ ఆడియన్స్ ని ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో ధనుష్, ఛాయా సింగ్ జంటగా నటించారు. తన కెరీర్ కి గుర్తింపు తీసుకువచ్చిన ఈ పాటని, శివ శంకర్

పాము పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. అలాంటిది ఓ చిన్నారి కింగ్ కోబ్రాను కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా..!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎవరైనా సరే పాము పేరు వింటేనే భయంతో వణికిపోతారు. అందులోనూ కింగ్ కోబ్రా అంటే ఆ భయం మరింత పెరిగిపోతుంది. అలాంటిది భారీ విషసర్పం ఎదురుగా ఉన్నా.. ఓ చిన్నారి ఏ మాత్రం భయపడలేదు. పైగా దాని ముందు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లిన చిన్నారి.. దానిని కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేస్తూ కనిపించింది. బాలిక తనను తట్టి లేపడంతో పాము ఒక్కసారిగా పడగ విప్పి దాడికి ప్రయత్నించింది. అయితే చిన్నారి వెంటనే వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేయడం మొదలెట్టింది. ఇంతటితో ఆగని ఆ బాలిక.. పాము తోక పట్టుకుని పైకి ఎత్తేందుకు కూడా ప్రయత్నించింది. సాధారణంగా మనుషుల కదలికలకే దూకుడుగా స్పందించే కింగ్ కోబ్రా.. చిన్నారి ఇంతగా కవ్వించినప్పటికీ దాడి చేయకుండా ఉండటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ చిన్నారి డ్యాన్స్ కింగ్ కోబ్రాకు నచ్చినట్టుంది’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే విషపూరిత పాములతో ఇలాంటి సాహసాలు అత్యంత ప్రమాదకరమని, ఎవరూ ఇలా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి రాసలీలలు బయటపడ్డాయి. జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) రాసలీలలు బయటపడ్డాయి. తోటి ఫోక్ డ్యాన్సర్, నటి మాధురి రాథోడ్(Madhuri Rathod) తో అతడు వేములవాడలోని రెడ్డి భవన్లో ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గుట్టు రట్టు అయ్యింది. అర్థరాత్రి సమయంలో ఒకే గదిలో ఇద్దరినీ చూసిన భార్య, తీవ్ర ఆగ్రహంతో మాధురిపై విరుచుకుపడింది. ప్రసిద్ధ జానపద గీతం బాసింగ బలాలు పాటతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయికి ఇప్పటికే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, తనతో కలిసి పలు ఫోక్ సాంగ్స్‌లో నటించిన మాధురి రాథోడ్‌తో ఆయన పరిచయం పెంచుకుని, అక్రమ సంబంధం నడుపుతున్నాడని భార్య ఆరోపించింది. వేములవాడలోని రెడ్డి భవన్లో వీరిద్దరూ ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న భార్య, వారిని నేరుగా పట్టుకుని నిలదీసింది. నా భర్తే నీకు దొరికాడా? అంటూ ఆవేదనతో మాధురిపై చెయ్యి చేసుకుంది. అనంతరం మీడియాతో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడుతూ.. తన భర్త చాలా మంచివాడని, కనీసం మందు కూడా తాగే అలవాటు లేని వ్యక్తి అని ఆమె పేర్కొంది. మాధురియే ఉద్దేశపూర్వకంగా తన భర్త మీద పడి లొంగదీసుకుందని కన్నీటి పర్యంతమైంది. తమకు పెళ్లయి 7 ఏళ్లు అవుతోందని, తమ దాంపత్య జీవితంలోకి మాధురి ప్రవేశించి కుటుంబాన్ని కూల్చివేసిందని ఆరోపించింది. గతంలో మాధురికి బ్రేకప్ అయిన సమయంలో తానే దగ్గరుండి ఓదార్చి, ఆదరించానని.. కానీ ఆమె తన పక్కనే ఉంటూ ఇలా వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదని ఆవేదన చెందింది. ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి ఎంతమాత్రం రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగానికి లోనయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Burqa Dance Controversy: యూపీలో ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినులు బర్ఖాలు ధరించి చేసిన నృత్యం పెను వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారడంతో పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్ మెంట్ బహిరంగంగా క్షమాపణలు కోరింది. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితో గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరిగింది. వేడుకల్లో భాగంగా బుర్ఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్ పురి, హర్యాన్వీ, బాలీవుడ్ పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేశ్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఏ మతాన్ని వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. డ్యాన్స్ చేసిన విద్యార్థులందరూ కూడా హిందూమతానికి చెందినవారేనని..కేవలం సరదా కోసమే అలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. జరిగిన పొరపాటునకు నేను చింతిస్తున్నాను.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం అవ్వగుండా చూసుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది. వీరిద్దరి అక్రమసంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, అయినా తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఇష్యు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఉంది. ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మరో ఫోక్ డాన్సర్ ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈశ్వర్ సాయి భార్య. ఇటీవల ఓ పాపులర్ ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా ఈ ఇద్దరూ నటించారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జమ్మూకశ్మీర్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్న పిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై మాజీ నటి, 'దంగల్' ఫేమ్ జైరా వసీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో లేదా వారి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైరా వసీమ్... ముస్లిం సమాజానికి సేవ చేస్తూ ఇస్లామిక్ విలువలను కాపాడాల్సిన మతపరమైన సంస్థ అయిన వక్ఫ్ బోర్డ్... ఇటువంటి కార్యక్రమాలను ఎలా ప్రోత్సహిస్తుందని నిలదీశారు. బహిరంగ వేడుకల్లో పిల్లలను, ప్రత్యేకించి బాలికలను కేవలం సంబంధం లేని పాటలకు డ్యాన్స్ చేయించడానికే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేలా, ఆలోచింపజేసేలా, సమాజానికి తోడ్పడేలా చేసే అవకాశాలను సంస్థలు కల్పించాలని సూచించారు. 'దంగల్', 'సీక్రెట్ సూపర్‌స్టార్' వంటి చిత్రాల్లో నటించిన జైరా వసీమ్... 2019లో తన మత విశ్వాసాల కోసం నటనా రంగానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే

చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత గా చూడాలి. ఖైదీకి ముందు కెరీర్ ని ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చిన చిరు.. ఖైదీ చిత్రంతో విశ్వరూపం ప్రదర్శించారు. టాలీవుడ్ లో నయా స్టార్ గా అవతరించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో ప్రతి అంశం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఖైదీ చిత్రంలోని రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఐకానిక్. అలాంటి సాంగ్ అప్పటి వరకు టాలీవుడ్ లో అస్సలు లేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. డ్యాన్స్ కొరియోగ్రఫీ, దర్శకత్వంకి కొత్త అర్థం చెప్పిన పాట అది. సలీం మాస్టర్ పర్యవేక్షణలో శివశంకర్ మాస్టర్ ఆ సాంగ్ ని కంపోజ్ చేశారు. చిరంజీవి, మాధవిలకు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. చిరు, మాధవి ఇద్దరూ మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసిన విధానం చాలా కష్టంతో కూడుకున్న ప్రాసెస్. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో శివ శంకర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సలీం మాస్టర్ అంటే నాకు చాలా గౌరవం, భయం. ఆయన పర్యవేక్షణలో ఎలాంటి తప్పు జరగకూడదు అని మనసులో అనుకుంటూ రగులుతోంది మొగలి పొద సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. రిహార్సల్స్ చేసి చిరంజీవికి డ్యాన్స్ మూమెంట్స్ చూపించాను. చిరంజీవి మాధవి ఇద్దరూ రిహార్సల్స్ పర్ఫెక్ట్ సింక్ లో చేశారు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ తర్వాత నాకు బాడీ పెయిన్స్, వెన్ను నొప్పు వచ్చాయి. మూడు నెలల పాటు సరిగ్గా నడవలేకపోయాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నాను. నేను డ్యాన్స్ మాస్టర్ ని.. ఆ సాంగ్ వల్ల నేనే అంత ఇబ్బంది పడితే ఇక చిరంజీవి పరిస్థితి ఊహించుకోండి. మాధవి పరిస్థితి ఊహించుకోండి. ఎంత కష్టం అయినా చిరంజీవి వెనకడుగు వేయకుండా ఆ సాంగ్ చేశారు. మాధవి కష్టం కూడా మరిచిపోలేం. ఇండియాలో డ్యాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ (Telangana BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (N. Ramchander Rao) శ్రష్టి వర్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులు ఒక్కటవుతున్న సమయంలో యువత రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావాలో జన్మించిన శ్రష్టి వర్మ ఇంటర్ వరకు చదివింది. చిన్న వయసులోనే డ్యాన్స్‌పై ఆసక్తితో ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపైకి వచ్చారు. తొలుత కో-డ్యాన్సర్‌గా కనిపించిన ఆమె.. ఆ తర్వాత ‘ఢీ జోడీ’లో తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృష్టి వర్మ క్రమంగా స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే.. శృష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు పెను సంచలనం సృష్టించగా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. అంతేగాక జానీ మాస్టర్ పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటకు కొరియోగ్రఫీ చేయడం ద్వారా శ్రష్టి వర్మ పేరు మారుమ్రోగింది. అంతకుముందు రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా ఆమె నృత్యరీతులు సమకూర్చారు. ‘క్రాక్’, ‘బీస్ట్’, ‘అల వైకుంఠపురములో’, ‘గేమ్ ఛేంజర్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘మనమే’ తదితర చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆపై

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బురఖాలు ధరించిన విద్యార్థినులు చేసిన నృత్యం పెను వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు కోరగా, విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.గోండా జిల్లాలోని నాలెడ్జ్ బీమ్ అకాడమీలో ఆగస్టు 15వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు వేదికపై భోజ్‌పురి, హర్యాన్వీ, బాలీవుడ్ గీతాలకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవ్వడంతో అటు హిందూ, ఇటు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.వివాదం ముదరడంతో పాఠశాల మేనేజర్ రామ్ సురేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఏ మత వర్గాన్ని లేదా వారి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. నృత్యం చేసిన విద్యార్థులందరూ హిందూ మతానికి చెందినవారేనని, కేవలం వినోదం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. "జరిగిన పొరపాటుకు నేను చింతిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అమిత్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తున్న ఈ సభా సమరంలో సర్కార్‌ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం, వైసీపీ దాడిని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి. మొదటిరోజే సభలో అసలైన రాజకీయం నడవనుంది. నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న మెగా డీఎస్సీ-2025పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిరోజే సభలో సంచలన ప్రకటన చేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు ఎల్-నినో ప్రభావంపై లఘు చర్చతో సభను మొదటిరోజే రసవత్తరంగా మార్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.గైర్హాజరైతే జీతాలు కట్.. స్పీకర్ సంచలన అస్త్రం!సభకు రాకుండా జారుకునే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై సభలో దొంగ హాజరులకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ-కెమెరాలు ఆటోమేటిక్‌గా ఆన్ అయి హాజరును రికార్డు చేసేలా డిజిటల్ కెమెరా టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా, ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజలు గెలిపించింది సభలో కూర్చుని మాట్లాడటానికేనని, జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.జగన్ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్! అసెంబ్లీకి రాకపోతే జీతం కట్గత అక్రమాలపై అటాక్.. నాలుగు రోజుల పొలిటికల్ డ్రామా!నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పాత సర్కార్ పాపాలను ఎండగట్టేందుకు పక్కా అజెండాతో వస్తోంది. ఆగస్టు 18న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుండగా.. మూడో రోజు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల స్కామ్‌ను బయటపెట్టేందుకు వ్యూహం రచించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, నాలుగో రోజు పెట్టుబడులతో పాటు సూపర్-6 హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించనుంది. మొత్తం 6 కీలక

Secunderabad: బాలంరాయి దండు మారెమ్మ ఫలహారం బండి ఊరేగింపు సికింద్రాబాద్: బాలంరాయి దండు మారెమ్మ దేవాలయం ఫలహారం బండి వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలాదారుడు హనుమంతరావు, బాలీవుడ్ నటులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫలహారం బండి విద్యుత్ దీపాల మధ్య వివిధ వేషాధారణలు పోతరాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకునే విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పలహారం బండి ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సలహాదారుడు విహెచ్ హనుమంతరావు బాలీవుడ్ నటులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ నాయకులు ఇతరులు ఫలహారం బండి ఊరేగింపులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భారత సైనికులతో కలిసి సందడి చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన సైనికులతో ముచ్చటించారు. ‘ప్రపంచవ్యాపంగా జరుగుతున్న యుద్ధాల కోసం నా పిల్లలు తైమూర్, జెహ్ తరుచూ నన్ను అడుగుతుంటారు. ఆ యుద్ధాలను చూసి పిల్లలు భయపడుతుంటారు. మమ్మల్ని ఎవరు కాపాడతారు? పరిస్థితులు మరింత దిగజారుతాయా? అని అడుగుతుంటారు. అప్పుడు నేను భారత సైన్యం మనల్ని రక్షిస్తోందని చెబుతుంటాను’ అని సైఫ్ తెలిపారు. కాశ్మీర్ దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటన్నారు. తన తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగుర్ నటించిన తొలి చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ తో పాటు అనేక చిత్రాల పాటలు కశ్మీర్‌లోనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రం సెప్టెబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

‘ఇంత లావణ్యరాశివి. నువ్వు తుపాకీ పట్టావా?’ అన్నాడు బ్రిటిష్ అధికారి. ‘క్షమాపణ అడుగు. ఉరిశిక్ష రద్దు చేస్తాను’ అని కూడా అన్నాడు. ఆమె అడగలేదు. కాన్పూర్‌లో ఆమె నాట్యగత్తె మాత్రమే కాదు తన దేశభక్తితో బ్రిటిష్‌వారిని ఉరుకులెత్తించిన వీరనారి. 400 మంది మహిళలతో సైన్యం తయారు చేసిన దళనాయకి. పేరు అజ్జన్ బాయి. వృత్తికి ‘తవాయిఫ్’. కాని దేశానికి వీరపుత్రిక. ఆడు’... అంటే ఆడాలి. ‘పాడు’ అంటే పాడాలి. నవాబుల కాలంలో ఉత్తరభారతంలో ‘తవాయిఫ్’లుగా పేరుబడ్డ నాట్యగత్తెల జీవితం అది. దక్షిణాదిన ‘దేవదాసీ’లది, ఉత్తరాదిన ‘తవాయిఫ్’లది సమాజంలో ఒకేలాంటి స్థానం. కాని ఈ ‘దేవదాసీ’ల్లో ఈ ‘తవాయిఫ్’లలోనూ చరిత్రను లిఖించిన వారు ఎందరో ఉన్నారు. కాన్పూరుకు చెందిన అజ్జన్ బాయిది అలాంటి చరిత్ర. 1857 తిరుగుబాటులో కాన్పూర్ వేదికగా సిపాయిలను నడిపించి, నాట్యగత్తె ముసుగులో గూఢచారిగా మారి, చివరకు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అజ్జన్‌బాయి వీరగాథ నేటికీ ఒక అద్భుతం. లక్నో నుండి కాన్పూర్ కోఠా వరకు అజ్జన్బాయిది లక్నో. అమె అసలు పేరు అజీజున్నిసా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆ రోజుల్లో అలాంటి ఆడపిల్లల్ని ‘కోఠా’ (నాట్యగత్తెలు ఉండే చోటు)లకు తరలించేవారు. అలా అజ్జన్‌బాయి లక్నో నుంచి కాన్పూర్‌కు మారి ‘లడ్కీ మహల్’ అనే కోఠాకు చేరింది. అయితే కాళ్లకు గజ్జెలు కట్టడం కంటే చేతిలో పుస్తకం పట్టడం గురించే అజ్జన్‌బాయి ధ్యాస. తన నాట్యం చూడటానికి వచ్చే పెద్దమనుషుల ద్వారా దేశ పరిస్థితులు తెలుసుకునేది. పెద్దమనుషులు ఇళ్లలోని స్త్రీలతో ఏ విషయాలూ పంచుకోకపోయినా ఇలాంటి చోట అనేకం విశదపరుస్తుంటారు. అప్పటికి తవాయఫ్ అంటే కేవలం సాహిత్యం, సంగీతం, సంస్కృతికి చిహ్నం. కానీ 1856లో బ్రిటిష్ వారు అవధ్‌ను ఆక్రమించిన తర్వాత తవాయిఫ్లను ‘వేశ్యలు’ అని ముద్ర వేశారు. దాంతో వారికి రాజాశ్రయం పోయింది. గౌరవం పోయింది. అప్పుడే అజ్జన్ గుండెలో కోపం పుట్టింది. ఆ కోపమే దేశభక్తి అయ్యింది. మస్తానీ

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై మంచి ఊపులో కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను అవుట్ చేసిన తర్వాత టాస్కిన్ అహ్మద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్ లో టాస్కిన్ వేసిన బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా బ్యాట్ కు తగలకుండా గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ లో ఉన్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దాన్ని అద్భుతమైన క్యాచ్ గా మలుచుకున్నాడు. గ్రీన్ అవుట్ కాగానే టాస్కిన్ తన నాలుక బయటకు పెట్టి విచిత్రంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లంతా రహీమ్ వైపు పరుగెత్తగా, టాస్కిన్ మాత్రం ఒంటరిగా చేసిన ఈ సరదా డ్యాన్స్ కెమెరాలో రికార్డై క్షణాల్లో వైరల్ గా మారింది. టాస్ తో పాటు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు తొలి సెషన్ లోనే బంగ్లాదేశ్ పేసర్లు ఊహించని షాక్ ఇచ్చారు. పచ్చిక ఉన్న పిచ్ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఎలాంటి నష్టం లేకుండా 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టారు. హసన్ మహమూద్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. లోకల్ హీరో జేక్ వెదర్‌ఆల్డ్ ను 23 పరుగుల వద్ద పెవిలియన్ పంపిన హసన్

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కామన్. హీరోహీరోయిన్ల సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి, ప్రేమకు సంబంధించిన విషయాలపై రకరకాలు గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఫోక్ డ్యాన్సర్, హీరోయిన్ నాగదుర్గపై కూడా ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె యంగ్ హీరో అఖిల్ రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం.. వీరిద్దరు కలిసి ఇటీవల గుడికి వెళ్లి పూజలు చేయడమే. ‘రాజు వెడ్స్ రాంబాయి’మూవీతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు అఖిల్ రాజ్. మరోవైపు ఫోక్ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ..ఇటీవల సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమిళంలో లవ్ ఓ లవ్ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ప్రియదర్శితో కలిసి ‘ఇడుపు కాయితం’ అనే మూవీ చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వీరిద్దరు కలిసి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. లవ్‌లో ఉన్నారు కాబట్టే కలిసి గుడికి వెళ్లారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడతున్నారు. మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుందని..అందుకే గుడికి వెళ్లారని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. అఖిల్ రాజు లేదా నాగదుర్గ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) బోనాలు స్పెషల్.. ఫ్యామిలీతో 'బేబి' వైష్ణవి చైతన్య (ఫొటోలు) మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు... మహిళా రిజర్వేషన్
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( TFTDDA ) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకకు సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు, యూనియన్ నాయకులు, ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, నటుడు తాగుబోతు రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా TFTDDA అభివృద్ధికి పునాది వేసిన వ్యవస్థాపకుల సేవలను సభ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కురాజు మాస్టర్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సోమరాజు, వ్యవస్థాపక కోశాధికారి ఎల్. వెంకటేశ్వరరావు అందించిన సేవలు, మార్గదర్శకత్వాన్ని సభ్యులు స్మరించుకున్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ... నిబంధనలు, బైలా ప్రకారమే నూతన కార్యవర్గాన్ని పారదర్శకంగా ఎన్నుకున్నామని, సభ్యులందరి సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.చిరంజీవి, రామ్ చరణ్‌లకు కృతజ్ఞతలుఅసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి తమ అసోసియేషన్ వ్యతిరేకమంటూ గతంలో ప్రచారంలోకి వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. తమ యూనియన్ సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆర్థికంగా కొండంత అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి ఉదారత, సహాయాన్ని యూనియన్ సభ్యులందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి సభ్యుడి కుటుంబానికి భద్రత కల్పించడమే తమ నూతన కార్యవర్గం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. అలాగే, అసోసియేషన్ స్థాపకులు ముక్కురాజు మాస్టర్, సోమరాజు, ఎల్. వెంకటేశ్వరరావు అందించిన సేవామార్గదర్శకాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.* టికెట్ రేట్లు తగ్గితేనే థియేటర్లు హౌస్‌ఫుల్... నిర్మాతలకు కనువిప్పు కలిగించిన ప్రేక్షకుడు జానీ మాస్టర్ క్షమాపణలుఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (జానీ మాస్టర్) పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల హాజరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరుకాకుండా, కేవలం రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు ప్రతి సభ్యుడి సీటు వద్ద కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే సభకు హాజరైనట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారం కనుగొంటారనే నమ్మకంతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరు సభ్యులు సభకు హాజరుకాకుండానే జీతభత్యాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యుల హాజరు విషయంలో పారదర్శకత కోసమే ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.ఇదే సందర్భంగా పలు ఇతర అంశాలపై ఆయన స్పందించారు. డీఎస్సీ అంశాన్ని అనవసరంగా వివాదాస్పదం చేయవద్దని సూచించారు. క్రీడా కోటా నియామకాలపై వాస్తవాలు తెలుసుకోవాలంటే తొలుత రికార్డులను పరిశీలించాలని, ఆ తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. రానున్న శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 17న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు

'లత్ లగ్ గయీ' పాటలో జాక్వెలిన్ గ్లామర్, ఎలిగెన్స్‌ను అద్భుతంగా చూపించింది. ఆమె కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ కొరియోగ్రఫీ, అద్భుతమైన హావభావాలు ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలిపాయి. ప్రేక్షకుల ఫేవరెట్ సాంగ్స్‌లో ఇది కూడా ఒకటి. 'లాల్ పరి' పాటలో జాక్వెలిన్ తన ఎలక్ట్రిఫైయింగ్ డాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను ఓన్ చేసుకుంది. ఈ హై-ఎనర్జీ ట్రాక్, పవర్ఫుల్ కొరియోగ్రఫీని ఆమె ఎంత ఈజీగా చేస్తుందో చూపించింది. దీంతో అభిమానులకు ఇది ఫేవరెట్ అయిపోయింది. 'బెజోస్' పాట కోసం జాక్వెలిన్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ కార్ల్ వైన్‌తో చేతులు కలిపింది. ఇది ఇంటర్నేషనల్ బీట్స్‌ను ఆమె సిగ్నేచర్ స్టైల్‌తో మిక్స్ చేసిన క్రాస్-కల్చరల్ కొలాబరేషన్. తన కాన్ఫిడెన్స్, గ్లామర్‌తో ప్రతి ఫ్రేమ్‌లోనూ అదరగొట్టింది
హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాస చివరి ఆదివారం కావడంతో భాగ్యనగరంలో బోనాల పండగ వాతావరణం అంబరాన్ని తాకింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. ఆలయం బయట డప్పు చప్పుళ్లకు డాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ గురించి చెబుతూ ఫరియా ఎమోషనల్ అయ్యారు.పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఫరియా అబ్దుల్లా అతిథిగా హాజరయ్యారు. బోనం ఎత్తుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పోతురాజుల విన్యాసాలు, డప్పు చెప్పుల మధ్య ఫరియా మాస్ డాన్స్ చేసి భక్తులను ఉత్సాహపరిచారు. బోనాల వేడుకల్లో ఫరియా డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారని కొనియాడారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైనందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు. ''తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటుంది. అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. కలిసి మెలిసి ఉంటారు. ఇలాగే ఉండాలి.అదే బెస్ట్'' అంటూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.\ఫరియా అబ్దుల్లా పక్కా హైదరాబాదీ అమ్మాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. ఆ సమయంలో 'నక్షత్ర' అనే షాట్ నటించారు. కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడి సినిమా ఛాన్స్ అందుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిట్టిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా

ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం) 'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది. (ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార) 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా.. బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం

బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ తన సోదరి జనని సంగీత్ వేడుకలో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. కుమారుడి డ్యాన్స్ చూసి బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హిరేష్ (Hiresh Bandla) చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగీత్ వేడుకలో హిరేష్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన అతడిని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లతో ప్రోత్సహించారు. ముఖ్యంగా తన సోదరి జనని సైతం తమ్ముడి డ్యాన్స్‌ను చూసి ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. తన కుమారుడిని జీవితంలో ఎంతో ఎత్తులో చూడాలని ఎన్నో కలలు కన్నానని.. మూడు రోజుల క్రితమే ‘డ్యాన్స్ చేయరా?’ అని తన కుమారుడిని అడిగానని, ఇప్పుడు సంగీత్ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి సంతోషంగా ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హిరేష్ డ్యాన్స్‌లో ఎన్టీఆర్ ‘టెంపర్’ పాటతో పాటు రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పాటకు కూడా స్టెప్పులు వేసి స్టేజీని దద్దరిల్లిచ్చాడు. తన సోదరి వివాహ వేడుకను మరింత సందడిగా మార్చిన హిరేష్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే బండ్ల గణేష్.. కుమారుడి డ్యాన్స్‌ను చూసి భావోద్వేగానికి గురైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Malla reddy daughter in law Preethi reddy dance in bonalu: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడచూసిన బోనాల సందడి కన్పిస్తుంది. ఊరువాడ, పల్లెపట్నం అని తేడాలేకుండా బోనాల పండుగ సంబురాలు అంబరాన్నితాకాయని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ గల్లి చూసిన, రోడ్లు చూసిన బోనాల సందడి కన్పించింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల వేడుక కన్నుల పండగలా మారింది. ఇక బోనాలకు సిటీపోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు. అనేక ఆలయాల వద్ద ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. అయితే.. .ఓల్డ్ సిటీలోని బోనాల జాతరలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. హైదరాబాద్ లోప్రతి ఆదివారం కూడా పలు ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయి.ఈరోజు కూడా ఎక్కడ చూసిన నగరంవ్యాప్తంగా బోనాలు పండగతో ఎక్కడ చూసిన సందడిగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో.. పాతబస్తీ మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంకు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు, ఓడిబియ్యం సమర్పించుకున్నారు.అయితే.. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి గ్రామీణ శైలిలో ఆమె వేసిన మాస్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. బోనాల ట్రెడిషన్ సాంగ్ కు ప్రీతిరెడ్డి కోడలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో అక్కడున్నవారు ఫిదా అయ్యారు. Read more; Hyderabad: హైదరాబాద్ ఘనంగా కొనసాగుతున్న బోనాల సంబరాలు.. పలు ఆలయాల్ని దర్శించుకున్న కేటీఆర్.. నార్మల్ గా మాజీ మంత్రి మల్లారెడ్డి

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (Telugu Film And TV Dancers and Dance Directors Association)లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. దాదాపు సమస్య ముగిసిందని చెబుతూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. కానీ, వారందరి మాటని లెక్క చేయకుండా జానీ మాస్టర్ వైఫ్, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (Sumalatha) రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఆదివారం (ఆగస్ట్ 9) బై ఎలక్షన్ నిర్వహించారు. అంతకుముందు పెద్దల మాటను, ఫెడరేషన్ నిర్ణయాన్ని లెక్కచేయని సుమలతపై పలువురు డ్యాన్సర్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగా కూడా ఫెడరేషన్ ప్రకటించింది. అయినప్పటికీ సుమలత వెనక్కి తగ్గలేదు. దాదాపు 600 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్‌లో 502 మందికి ఓటు హక్కు ఉండగా.. కేవలం 116 మంది మాత్రమే ఈ బై ఎలక్షన్లో పాల్గొన్నారంటే.. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ వంటి వారంతా ఈ ఎన్నికలకు దూరంగా ఉండి, తమ అభిప్రాయం ఏంటో స్పష్టం చేశారు. ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, న్యాయ సలహాదారుడైన వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 502 ఓట్లు ఉండగా.. 114 ఓట్లు మాత్రమే పోలాయ్యాయి.. వాటిలో 2 ఓట్లు చెల్లనివిగా గుర్తించినట్లుగా తెలిపారు

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారితో మమేకమయ్యారు. డప్పు వాయిస్తూ, ధింసా నృత్యకారులతో కలిసి అడుగులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు గిరిజన మహిళలు, మంత్రి సంధ్యారాణి, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ ధింసా నృత్యం, డప్పు వాయిద్యాల నడుమ సీఎం వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా డప్పు చేతబట్టి వాయించి సభలో కొత్త ఉత్తేజం నింపారు.అంతకుముందు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ప్రతి పౌరుడూ దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం కోసం ఓ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సంప్రదాయాలను కాపాడుతున్న గిరిజనులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారని కొనియాడారు. సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి స్థాయికి ఎదగడమే దీనికి నిదర్శనమని గుర్తుచేశారు."మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ వంటి ఎందరో సామాన్యులే సంకల్ప బలంతో అసాధారణ విజయాలు సాధించారు" అని చంద్రబాబు అన్నారు. "నేను, నా దేశం, నా రాష్ట్రం అనే భావనతో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనేది నా సంకల్పం" అని స్పష్టం చేశారు.ఒక రైతు పంట పండించినా, ఒక విద్యార్థి బాగా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Laldarwaza Simhavahini Bonalu 2026: హైదరాబాద్ బోనాలు ఎంతో విశిష్టమైనవి, వీటిని ఆషాఢ బోనాల్లో చివరి ఘట్టంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు హైదరాబాద్ లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రాత్రి నుంచే భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రేపు కూడా అధికారిక సెలవు ప్రకటించింది. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో బోనాలను నిర్వహిస్తారు, ముఖ్యంగా చివరి ఆషాడ ఆదివారం లాల్ దర్వాజా బోనాలతో ముగుస్తుంది. నగరంలోని మొత్తం 3500 ఆలయాల్లో ఈరోజు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ బందోబస్తు, ట్రాఫిక్ నిబంధనలను కూడా అమలు చేశారు. అన్ని ఆలయాల వద్ద అమ్మవారి పాటలతో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుతున్నారు. రేపు సెలవు.. హైదరాబాద్ బోనాల ఉత్సవాలు నగరవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, అక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఘనంగా బలిహరణం.. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి బలిహారణం దేవి అభిషేకం నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించడం ప్రారంభమైంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించగా, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు

నంగునూరు (సిద్దిపేట): తమ అటెండెన్స్ తామే వేసుకుంటూ మురిసిపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్ధూంపూర్ పాఠశాల విద్యార్థులు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో హెచ్‌ఎంతోపాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఉపాధ్యాయుడు ముస్లీ రాజయ్య నోటీస్ బోర్డుపై అగ్గిపెట్టెతో కూడిన సెల్ఫ్ అటెండెన్స్ బోర్డును ఏర్పాటు చేశారు. విద్యార్థి పాఠశాలకు రాగానే అగ్గిపెట్టెను తెరిచి తన ఫొటో కనబడేలా ఉంచి హాజరు వేసుకుంటాడు. బడి సమయం ముగియగానే అగ్గిపెట్టెను మూసివేసి ఇంటికి వెళ్తారు. ఒకవేళ విద్యార్థి మర్నాడు రాకుంటే ఆబ్సెంట్ కనబడుతుంది. దీంతో బడికి రాలేదని తెలిసిపోతుందని విద్యార్థులు రోజూ వస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో మిగతా తరగతులకు సెల్ఫ్ అటెండెన్స్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన