.webp)
బోల్డ్ లుక్‌లో షాక్ ఇచ్చిన తేజస్వి మడివాడ!
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ మరోసారి తన బోల్డ్ లుక్ తో నెట్టింట షాక్ ఇచ్చింది. dance has entered my life again అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్ లో నాలుగు ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
© 2026 nimisham.in
.webp)
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ మరోసారి తన బోల్డ్ లుక్ తో నెట్టింట షాక్ ఇచ్చింది. dance has entered my life again అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్ లో నాలుగు ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది.

ఢిల్లీ వేదికగా కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తన పైన హైకమాండ్ చర్యలకు సిద్దం అవుతున్న వేళ కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ తో అమీ తుమీకి సిద్దం అయ్యారు. తన పైన చర్యలు తీసుకునే ముందే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ చీఫ్ ఖార్గేతో భేటీ అయిన కొండా ఆ తరువాత ఈ వ్యాఖ్యలు చేసారు. బీసీ కార్డు తెర మీదకు తీసుకొచ్చారు. తన పైన వేటు వేస్తే ఆ వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలతోనూ సురేఖ సిద్దం అయినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా మరో సంచలనానికి కారణమయ్యారు. సీఎం రేవంత్ తో పాటుగా కేబినెట్ మంత్రులను టార్గెట్ చేసారు. తాను తప్పు చేయలేదని.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను బాధ్యత ఎలా వహిస్తానని ప్రశ్నిస్తున్నారు. తనకు అసలు నోటీసులు ఇవ్వటమే తప్పు అని తేల్చి చెప్పారు. రాహుల్ పదే పదే మహిళలు స్వతంత్రంగా బతకాలని చెబుతూ ఉంటారని.. ఇప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీసీ అయిన తన పైనే చర్యలు ఉంటాయా.. రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తన్న ఇతర వర్గాలకు చెందిన వారి పైన ఉండవా అంటూ ప్రశ్నించారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా చెబుతారని సురేఖ నిలదీసారు. పరకాల సీటు రేవంత్ ఎలా ప్రకటిస్తారని.. ఇది క్రమశిక్షణా రాహిత్యం కింద కు రాదా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెబుతున్న రేవంత్ పైన ర్యలు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు.నా కంటే ముందు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి - ఢిల్లీలో సురేఖ సంచలనం..!!వేటు వేస్తే ఆ వెంటనే.. యాక్షన్ ప్లాన్ సిద్దంతన బిడ్డ ను రెచ్చగొడితే స్పందించిందని .. ఇదే విషయాన్ని తాను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా వివరించానని చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే సమయంలో కొండా సురేఖ తనతో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్ శుక్రవారం.. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్ దాడిలో లోచబ్ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) కెరీర్లో బ్రహ్మాస్త్ర2(brahmastra2) మరోసారి కీలక ప్రాజెక్ట్‌గా మారుతోంది. అయాన్ ముఖర్జీ(Ayaan Mukherji) దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భాగం తర్వాత సీక్వెల్‌పై చాలాకాలంగా డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు మళ్లీ వేగం పుంజుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ టీమ్ బ్రహ్మాస్త్ర2 స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రామాయణ(Ramayana) రెండో భాగం షూటింగ్‌ను 2027 జనవరి నాటికి పూర్తి చేయనున్న రణ్‌బీర్.. కొంత గ్యాప్ తర్వాత ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీక్వెల్లో మరో ఆసక్తికరమైన అంశం దీపికా పదుకొణె(Deepika Padukone)తో సంబంధించినదిగా చెబుతున్నారు. అమృత(Amrutha) పాత్ర కోసం ఆమెతో చిత్రబృందం డిస్కషన్స్ జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు రణ్‌బీర్ శివ(Shiva)తో పాటు దేవ్(Dev) అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అలియా భట్(Alia Bhatt) ఈషా(eesha)గా తిరిగి కనిపించనుందని టాక్. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వార్2(war2) తర్వాత అయాన్ ముఖర్జీ కెరీర్‌పై వచ్చిన డిస్కషన్స్ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర2 లేటవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియన్ మైథాలజీని మరింత విస్తృతంగా చూపిస్తూ ఆస్ట్రావర్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రణ్‌బీర్ చేతిలో సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali)లవ్ అండ్ వార్(Love and war), సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) యానిమల్ పార్క్(Animal Park2) వంటి భారీ సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్, రిలీజ్ డేట్స్ ను బట్టి బ్రహ్మాస్త్ర 2 షెడ్యూల్ ఎలా సెట్ అవుతుందో చూడాలి

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. శక్తి పథకం, జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేలా ఇచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా.. మహబూబాబాద్ పట్టణ సీఐ రఘుపతి రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.సుస్మితా.. రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోవు.. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసు!పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో విద్యార్థులను నిలవరించే యత్నంలో ఇరువర్గాల మధ్య కొంత సేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుంటూ బయటకు పంపారు. సీఐ రఘుపతి రెడ్డి ఒకరిద్దరు విద్యార్థుల గొంతు పట్టుకొని వెనక్కి నెట్టుకుంటూ వెళ్లడంతో కలెక్టరేట్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఐ రఘుపతి రెడ్డి తీరును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనలను ముమ్మరం చేశారు. అనంతరం కాసేపటి తర్వాత అదనపు పోలీసు బలగాలను రప్పించి విద్యార్థులందరినీ బయటకు తీసుకెళ్లి గేటును మూసివేశారు. ఈ క్రమంలో పోలీసులు కలెక్టరేట్ గేట్లు బంద్ చేసి భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కలెక్టరేట్ గేటు బయట రెండు గంటలపాటు బైఠాయించి నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆవేదనడిప్లొమా చేసే విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళే ఉంటారని.. ఇప్పుడు దీన్ని శక్తి స్కీంలోకి తెస్తే మేం ఏమైపోవాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచిధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారే తప్ప మా భవిష్యత్తు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత దుబాయ్‌కి చెందిన ఒక విదేశీ వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైనట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. సదరు వ్యక్తి సానియా మీర్జాకు అత్యంత సన్నిహితుడని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతని కోసమే సానియా దుబాయ్‌లో శాశ్వతంగా స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్రెట్ లవ్‌కు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, దుబాయ్‌లోనే అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రహస్యంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వస్తున్న ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొలి వివాహం, విడాకుల నేపథ్యం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను రెండో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తరుణంలో, సానియా కుటుంబం వారి విడాకుల విషయాన్ని బయటపెట్టింది. షోయబ్ వివాహేతర సంబంధాల వల్లే వారు విడిపోయినట్లు ప్రచారం

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై తీవ్ర ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. 29 కేసులతో సువేందు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులు, కేరళ సీఎం వీడీ సతీశన్‌పై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తన అఫిడివిట్లో తెలిపారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్‌ను క్రియాశీలంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులను కూడా ఆదేశించాలని కోరారు. ‘543 మంది ఎంపీల లోక్‌సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. చార్జిషీటు కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళకు చెందిన 95ు మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82ు మంది ఎంపీలపై.. ఒడిసాలో 76ు మంది పార్లమెంటు సభ్యులపై కేసులు

దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ గత దశాబ్దకాలంగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా.. సీనియర్ న్యాయవాది, అమిస్క్యూరీ విజయ్ హన్సారియా ఆందోళనకరమైన గణాంకాలను న్యాయస్థానానికి సమర్పించారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే నిజం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.రాష్ట్రాల్లో పాలకుల కేసుల చిట్టా!ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదు కాగా, కేరళకు చెందిన వీడీ సతీశన్‌పై 18 కేసులు ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిలతో పాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా కేసుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల పరంగా చూస్తే బెంగాల్లో అత్యధికంగా 58 శాతం మంది సభ్యులపై తీవ్రమైన కేసులు ఉండగా.. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..పార్లమెంట్‌లోనూ అదే తీరు!కేవలం శాసనసభలకే పరిమితం కాకుండా పార్లమెంట్ సభ్యులపై కూడా భారీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో

భారత చట్టసభల్లో నేరచరితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది. దేశంలోని 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 251 మంది, 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని సుప్రీంకోర్టులో దాఖలైన ఓ అఫిడవిట్ వెల్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ వివరాలను కోర్టు ముందుంచారు.అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) డేటాను ఉటంకిస్తూ హన్సారియా ఈ నివేదికను సమర్పించారు. దీని ప్రకారం.. లోక్‌సభలోని 251 మంది ఎంపీలలో 170 మందిపై ఐదేళ్లకు పైగా శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అలాగే, రాజ్యసభలో కేసులు ఎదుర్కొంటున్న 75 మందిలో 40 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ్యులపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌పై 19 కేసులు ఉన్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళలోని 20 మంది ఎంపీల్లో 19 మంది (95 శాతం) క్రిమినల్ కేసులు

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు. అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలోని వివరాల మేరకు.. సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు పెండింగ్‌లో ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు.. మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులో ఉన్నాయి. ఇక, లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. లోక్‌సభలోని 170 మంది సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త శాఖను ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం.. ఆహార, ఔషధ కల్తీలపై ‘TG SAFE’ (తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) పేరిట ఒక ప్రత్యేక శక్తివంతమైన కొత్త శాఖను ఏర్పాటు చేసింది. దీనికి విభాగాధిపతిగా అవినాష్ మొహంతిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి

Devdutt Padikkal Century: లంకతో గాలేలో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు బలమైన స్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణం దేవదత్ పడిక్కల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడడంలో తేలిపోతున్నారనే ముద్ర ఉంది. కానీ, తాజాగా లంక జట్టును ఓ టీమిండియా కుర్రాడు మైదానంలో సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో కదంతొక్కాడు. లంక స్పిన్నర్లను చీల్చిచెండాడుతూ ఏకంగా 167 పరుగులతో భారత క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. స్పిన్ బూచీకి చెక్.. క్రీజులో అడుగుపెట్టగానే బౌండరీ.. గత కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. ఈ బలహీనతను పారద్రోలుతూ వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే కళ్లుచెదిరే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టాడు. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! తొలిరోజు ఆట ముగిసే సమయానికి 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 131 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. లంక స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పడిక్కల్ ఆడుతున్న తీరు చూస్తుంటే రెండో రోజు అవలీలగా డబుల్ సెంచరీ సాధించేలా కనిపిస్తున్నాడు. బ్యాక్‌ఫుట్ పవర్‌తో గవాస్కర్ ప్రశంసల వర్షం.. స్లో టర్నింగ్ పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కోవడానికి పడిక్కల్ ఎంచుకున్న వ్యూహం పట్ల భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అమితంగా ఆకట్టుకున్నాడు. ఫీల్డర్లు దూరంగా ఉన్నప్పుడు ఎంతో సునాయాసంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడని ప్రశంసించాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్లు ఆడటమే ఈ కుర్రాడి అసలైన బలమని విశ్లేషించాడు

ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో వందేమాతరం ఆలాపనను ఎంపీ సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. ఉర్వా పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతల తీరు జాతీయ గేయాన్ని అవమానించినట్టుగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జాతీయ గేయం ఆలాపన సందర్భంగా ఖర్గే, సోనియా గాంధీలు అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల తీరు దురదృష్టకరమని బీజేపీ నేత షహనవాజ్ హుస్సేన్ అన్నారు. గేయ ఆలాపనకు అడ్డుపడే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం కావాలనే జాతీయ గేయాన్ని అవమానించిందని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆలాపన సజావుగా సాగుతోందా? లేదా? అనే విషయాన్ని సోనియా గాంధీ చెక్ చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం సుప్రీంకోర్టుకు.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సవాల్.. ముంబై నేవీ నగర్లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఇంటర్నెట్ డెస్క్: అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఆమెపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ అమాయక బాలుడి ముద్దు ముద్దు మాటలకు అక్కడి వారంతా నవ్వారు. ఈ ఘటన మధప్రదేశ్ బుర్హాన్‌పూర్‌లోని దేధ్తలై పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. చెప్పిన మాట వినడం లేదని.. ఆ బాలుడిని తల్లి మందలించింది. అతడి వద్ద ఉన్న చాక్లెట్ తీసుకుంది. దీంతో తల్లిపై కోపం తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రి చెప్పి.. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపాడు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలంటూ తండ్రిని కోరాడు. దాంతో బాలుడిని ఆ తండ్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ ప్రియాంక నాయక్ ఏమైందని ఆ బాలుడిని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెకు తన ముద్దు ముద్దు మాటలతో.. అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తుంది. నన్ను కొడుతుంది. ఆమెను జైలులో పెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తెల్ల కాగితంపై ఎస్ఐ ఫిర్యాదు రాసింది. ఆ కాగితం కింద సంతకం చేయాలని ఆ బాలుడిని ఎస్ ఐ కోరింది. అక్షరాలు కూడా రానీ ఆ బాలుడు ఓ చిన్న గీత గీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లైకులు సైతం ఈ వీడియోకు భారీగా వస్తున్నాయి. అయితే ఈ వీడియో 2022 నాటిది. నేటికి వైరల్ అవుతుండడం విశేషం. మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ.. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఫిర్యాదు న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ ఆ కార్యాలయం రాహుల్‌కు నోటీసు పంపించింది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత చర్యల నివారణ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూల్ నెంబరు 353 ప్రకారం ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే అమిత్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ జైశ్వాల్‌లు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌కు నోటీసు పంపించింది

వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో నిర్లక్ష్యమే కారణం అమరావతి: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైఎ్‌సఆర్ కడప జిల్లాలకు చెందిన ఏపీవోలకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల డ్వామా పీడీలకు సూచించారు. ఈ ఏడాది జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ, శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో ఆయా ఏపీవోలు పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలతో ఇటీవల గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్ అధికారులు సమావేశమై చర్చించారు. వారి వివరణ సహేతుకంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు

గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఎన్డీఏ సోషల్ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు సూచించింది. కూటమి శ్రేణుల ముసుగులో గొడ్డలి పార్టీ అరాచకం ఫేక్ అకౌంట్లతో ఐక్యతను దెబ్బతీసే యత్నాలు మిత్రపక్షాలను విమర్శించొద్దు.. నేతల దృష్టికి తెండి అమరావతి: గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఎన్డీఏ సోషల్ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు సూచించింది. ‘కొందరు గొడ్డలి పార్టీకి చెందినవారు.. కూటమిలోని ఏదో ఒక పార్టీ అభిమానులుగా నటిస్తూ కూటమిలోని మిత్రపక్షాలను విమర్శిస్తూ.. నేతలను దూషిస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. దీంతో అసలైన కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేశానికిలోనై మిత్రపక్షాలపై దాడులకు దిగుతున్నారు. చివరికి మనలో మనమే గొడవపడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తున్నాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి విరుద్ధం. ఈ పరిస్థితికి స్వస్తి పలికేందుకు ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలెవరైనా మిత్రపక్షాల నేతలు, వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూ షణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే.. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది. ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.. కూటమి కార్యకర్తల ముసుగులో ఉన్న గొడ్డలి పార్టీ వ్యక్తులను గుర్తించి, వారి కుట్రలను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. అసలైన కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలని సమన్వయ కమిటీ కోరింది

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. ఇంటర్నెట్ డెస్క్: సిరియా దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే కేసులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్‌కు సిరియా కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. తీర్పు వెలువడే సమయంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నజీబ్ ఖైదీ దుస్తులు ధరించి బోనులో నిలబడి ఉండగా న్యాయమూర్తి తీర్పును చదివారు. 2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహేర్ రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అతేఫ్ నజీబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టారు. అసద్ ప్రభుత్వంలో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారుల్లో నజీబ్ ఒకరిగా ఉన్నారు. నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011లో బషర్ అసద్ పాలనలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. అక్కడ తిరుగుబాటును అణచివేసిన చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు.. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్

పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పాలకులు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘పెల్లెట్ గన్నులు, ముళ్లు ఉన్న బాటన్స్, టియర్ గ్యాస్.. వీటితో విద్యార్థులపై దాడులు జరిగాయి. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన వారిపై దాడులు జరిగాయి. యువతులను కూడా పోలీసులు కొట్టారు. పలువురికి ఎముకలు విరిగాయి. ప్రశ్నలు అడిగిన వారితో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించింది’ ‘పార్లమెంటు సమావేశాలు 20 రోజులుగా జరుగుతున్నా హోం మంత్రి సభకు రాలేదు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం తిరస్కరణకు గురైంది. ఈ మౌనం నిర్లక్ష్యమో మరొకటో కాదు.. అక్కడ జరిగిన హింసకు ఆమోదం. వాళ్లు దోషులైనా అయ్యుండాలి లేదా అసమర్థులైనా అయ్యుండాలి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ ఉదంతంపై దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అప్పటివరకూ మా పోరాటం ఆగదు’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల నిరసన
కళ్ల కింద నల్ల మచ్చలు, ఉబ్బడం వంటి సమస్యలను తగ్గించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. దీనికోసం వాడిన తర్వాత టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి కళ్లపై 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చెప్పులు, షూలు పెట్టే స్టాండ్ దుర్వాసన రాకుండా ఉండేందుకు కూడా వీటిని ఉపయోగించొచ్చు. దీనికోసం వాడిన టీ బ్యాగ్‌ను స్టాండ్‌లో పెడితే సరిపోతుంది. వంట చేసిన తర్వాత చేతులు ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన వస్తుంటాయి. ఈ వాసన తగ్గించడానికి వాడిన టీ బ్యాగ్‌ను చేతులకు రుద్ది తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎండ వల్ల చర్మం కమిలిపోవడం (ఎర్రగా మారడం), పురుగులు కుట్టినచోట ఎర్రగా మారితే ఈ టీ బ్యాగ్ చిట్కా ఉపయోగించొచ్చు. దీనికోసం వాడిన టీ బ్యాగ్ ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత ప్రభావిత ప్రదేశంలో మర్దన చేస్తే సరిపోతుంది. అన్నానికి మంచి ఫ్లేవర్ అందించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో వాడిన టీ బ్యాగ్ వేసి మరిగించండి. ఈ నీటిని అన్నం వండేందుకు ఉపయోగిస్తే సరిపోతుంది. మొక్కలకు కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మొక్క చుట్టూ టీ బ్యాగ్‌లోని పొడి చల్లితే మంచిది.దీనివల్ల కీటకాలు, ఎలుకలు వంటివి రాకుండా ఉంటాయి. ఇంట్లో మీరు వాడే అద్దాలు, విండో అద్దాలను క్లీన్ చేసేందుకు టీ బ్యాగ్ ఉపయోగించొచ్చు. దీనికోసం ముందుగా వాడిన టీ బ్యాగ్‌తో అద్దాలు తుడిచి తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడిస్తే సరిపోతుంది. నేలకు తగినంత నైట్రోజన్ అందించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. అందుకే మీరు తయారుచేసే కంపోస్ట్‌లో టీ బ్యాగ్‌లు వేస్తే మరీ మంచిది. కార్పెట్లు లేదా మ్యాట్లు వాసన వస్తుంటే వాటిపై ఈ టీ బ్యాగ్స్ ఉంచొచ్చు. ఇవి దుర్వాసన పీల్చుకోవడంలో సహాయపడి మంచి వాసన అందిస్తాయి

రాజమండ్రిలో ఈ నెల 3న ఆదిత్య మాల్ వద్ద ఫ్రెండ్ తో కలిసి సినిమాకు వెళ్తున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక (Rajahmundry Medico Priyanka )ను కారుతో మూడుసార్లు ఢీకొట్టి, ఆమె తలపై నుంచి కారు పోనిచ్చిన ఘటనలో ఆమె సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియాంకపై కారు నడిపి ఆమె బ్రెయిన్ డెడ్ కావడానికి కారణమైన నిందితుల్ని ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడం, వారిపై సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తండ్రి వెంకటేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.AP Govt: ఆయుష్ వైద్యానికి ఏపీ గుర్తింపు-7 కేటగిరీల్లో ఆస్పత్రులు-రూల్స్ ఇవే..!ఈ నెల 3న రాజమండ్రిలో ఈ ఘటన జరిగినా పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యంగా ఉండిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ప్రియాంకపై కారు నడిపిన ఇద్దరు నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఇద్దరూ స్థానికంగా పరపతి ఉన్న వారు కావడమే అనే ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. తొలుత వీరిపై సాధారణ సెక్షన్లు పెట్టిన పోలీసులు.. అనంతరం ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యాక వాటిని మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఆమె తండ్రి మరో కేసు నమోదు కోసం ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలని, తన కుమార్తెకు ఈ గతి పట్టించిన వారికి చట్టప్రకారం తగిన శిక్షలు పడాల్సిందేనని తండ్రి వెంకటేష్ కోరుతున్నారు. దీంతో ఆయనతో జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న ప్రియాంక ఆరోగ్య పరిస్ధితి ఏమాత్రం
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే ఏ ప్రయత్నాన్నైనా అధికారికంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ఎంపీలతో ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రాబోయే 40- 50 ఏళ్ల వరకు ప్రజాప్రతినిధుల స్థానాల సంఖ్యలో మార్పును రాష్ట్రం భరించలేదని, అందుకే డిలిమిటేషన్ ప్రక్రియకు ఐక్యంగా 'నో' చెప్పాలని నాయకులు నిర్ణయించినట్లు వర్గాలు వెల్లడించాయి.డీలిమిటేషన్‌కు వ్యతిరేకం‘‘మేము డిలిమిటేషన్కు మద్దతు ఇవ్వం.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి విజయ్ చాలా మంచి అడుగు వేశారు.. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి సరైన అర్థం ఉండదు.. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను, హక్కులను కాపాడటానికి ముఖ్యమంత్రి తమ నిబద్దతను పునరుద్ఘాటించారు’’ అని కాంగ్రెస్ ఎంపీ జోషిమణి పేర్కొన్నారు.విజయ్‌కు కనిమొళి సవాల్అధికార టీవీకే కూటమికి చెందిన కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ తో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 19 మంది ఎంపీలు హాజరయ్యారు. అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి.. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ప్రాధాన్యతలను ప్రశ్నిస్తూ కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయనకు సవాలు విసిరారు.మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి వ్యక్తిగతంగా సమర్పించేందుకు, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఎంపీలను పంపడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారా? అని కనిమొళి ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే ప్రస్తుత చట్టాన్ని సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలను కూడా వెల్లడించలేదు.పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తగ్గించే లేదా దాని హక్కులను ప్రభావితం చేసే ఎలాంటి డీలిమిటేషన్