
కళ్ల కింద నల్ల మచ్చలు, ఉబ్బడం వంటి సమస్యలను తగ్గించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. దీనికోసం వాడిన తర్వాత టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి కళ్లపై 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది.
చెప్పులు, షూలు పెట్టే స్టాండ్ దుర్వాసన రాకుండా ఉండేందుకు కూడా వీటిని ఉపయోగించొచ్చు. దీనికోసం వాడిన టీ బ్యాగ్‌ను స్టాండ్‌లో పెడితే సరిపోతుంది.
వంట చేసిన తర్వాత చేతులు ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన వస్తుంటాయి. ఈ వాసన తగ్గించడానికి వాడిన టీ బ్యాగ్‌ను చేతులకు రుద్ది తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఎండ వల్ల చర్మం కమిలిపోవడం (ఎర్రగా మారడం), పురుగులు కుట్టినచోట ఎర్రగా మారితే ఈ టీ బ్యాగ్ చిట్కా ఉపయోగించొచ్చు. దీనికోసం వాడిన టీ బ్యాగ్ ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత ప్రభావిత ప్రదేశంలో మర్దన చేస్తే సరిపోతుంది.
అన్నానికి మంచి ఫ్లేవర్ అందించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో వాడిన టీ బ్యాగ్ వేసి మరిగించండి. ఈ నీటిని అన్నం వండేందుకు ఉపయోగిస్తే సరిపోతుంది.
మొక్కలకు కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మొక్క చుట్టూ టీ బ్యాగ్‌లోని పొడి చల్లితే మంచిది.దీనివల్ల కీటకాలు, ఎలుకలు వంటివి రాకుండా ఉంటాయి.
ఇంట్లో మీరు వాడే అద్దాలు, విండో అద్దాలను క్లీన్ చేసేందుకు టీ బ్యాగ్ ఉపయోగించొచ్చు. దీనికోసం ముందుగా వాడిన టీ బ్యాగ్‌తో అద్దాలు తుడిచి తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడిస్తే సరిపోతుంది.
నేలకు తగినంత నైట్రోజన్ అందించడంలో టీ బ్యాగ్ సహాయపడుతుంది. అందుకే మీరు తయారుచేసే కంపోస్ట్‌లో టీ బ్యాగ్‌లు వేస్తే మరీ మంచిది.
కార్పెట్లు లేదా మ్యాట్లు వాసన వస్తుంటే వాటిపై ఈ టీ బ్యాగ్స్ ఉంచొచ్చు. ఇవి దుర్వాసన పీల్చుకోవడంలో సహాయపడి మంచి వాసన అందిస్తాయి.





