
Syria Court Sentences Former President Bashar Al Assad And Brother To Death In Absentia Sj 1549037
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: సిరియా దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే కేసులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్‌కు సిరియా కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. తీర్పు వెలువడే సమయంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నజీబ్ ఖైదీ దుస్తులు ధరించి బోనులో నిలబడి ఉండగా న్యాయమూర్తి తీర్పును చదివారు.
2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహేర్ రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అతేఫ్ నజీబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టారు. అసద్ ప్రభుత్వంలో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారుల్లో నజీబ్ ఒకరిగా ఉన్నారు.
నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011లో బషర్ అసద్ పాలనలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. అక్కడ తిరుగుబాటును అణచివేసిన చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..





