
Aug 9 2026 6:01 AM | Updated on Aug 9 2026 6:01 AM
నంగునూరు (సిద్దిపేట): తమ అటెండెన్స్ తామే వేసుకుంటూ మురిసిపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్ధూంపూర్ పాఠశాల విద్యార్థులు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో హెచ్‌ఎంతోపాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఉపాధ్యాయుడు ముస్లీ రాజయ్య నోటీస్ బోర్డుపై అగ్గిపెట్టెతో కూడిన సెల్ఫ్ అటెండెన్స్ బోర్డును ఏర్పాటు చేశారు.
విద్యార్థి పాఠశాలకు రాగానే అగ్గిపెట్టెను తెరిచి తన ఫొటో కనబడేలా ఉంచి హాజరు వేసుకుంటాడు. బడి సమయం ముగియగానే అగ్గిపెట్టెను మూసివేసి ఇంటికి వెళ్తారు. ఒకవేళ విద్యార్థి మర్నాడు రాకుంటే ఆబ్సెంట్ కనబడుతుంది. దీంతో బడికి రాలేదని తెలిసిపోతుందని విద్యార్థులు రోజూ వస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో మిగతా తరగతులకు సెల్ఫ్ అటెండెన్స్ బోర్డులను ఏర్పాటు చేశారు.
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్
హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు
షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన




