
తిరుపతి: ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం
, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఈ రెండేళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీలేవన్నారు.
‘‘వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించా. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇవాళ అనుభవిస్తున్నారు. గొడ్డలిపార్టీ అరాచక పాలన చూశాం.. ఎన్నో దారుణాలు జరిగాయి. ఒక్క మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడిని చంపేశారు. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన చూశాం. తెదేపా జెండా లేకుండా చేస్తామని నాడు వైకాపా నేతలు అన్నారు. ఇవాళ ప్రజలే వైకాపా జెండా పీకేశారు.. టీమ్ 11 తీర్పు ఇచ్చారు. రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. వైకాపా అరాచకాలు చూస్తూ మౌనంగా ఉండేది లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రాయలసీమ అంటే ఎన్టీఆర్‌కు చాలా ప్రేమ. నాడు కరవు వస్తే జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా వర్సిటీ ఏర్పాటు చేశారు. రాయల్ సీమను రాయల్‌సీమగా మార్చాం. రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి మన సీబీఎన్. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది’’ అని లోకేశ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వేసవి సెలవుల అనంతరం.. ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో ఆయా పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ ఫొటోలు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలో రాణించాలంటే కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.