
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో పాటు వైకాపాకు చెందిన 24 మంది కార్యకర్తలను వెంటనే అరెస్టు
చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్ద,రు కుమారులతో పాటు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిరసన తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వేసవి సెలవుల అనంతరం.. ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో ఆయా పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ ఫొటోలు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలో రాణించాలంటే కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.