
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న నటి త్రిష కృష్ణన్. దళపతి విజయ్ 'లియో' సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బ్యూటీ. త్రిషకి ఇప్పుడు 43 ఏళ్లు! కానీ, ఆమెను
చూస్తే అంత వయసు ఉంటుందని ఎవరూ నమ్మలేరు.
ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ప్రియులలో ఇలాంటి హ్యాంగింగ్ వర్కౌట్లు బాగా పాపులర్ అవుతున్నాయి. వీటివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడమే కాకుండా, రోజంతా షూటింగ్లలో పనిచేయడం వల్ల వెన్నెముకపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కేవలం అందం కోసమే కాదని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఈ కష్టం చాలా అవసరం అని త్రిష అంటోంది. త్రిష పడుతున్న ఈ కష్టం, ఫిట్‌నెస్‌పై ఆమెకున్న శ్రద్ధ ఇప్పటి యాక్ట్రస్ కే కాదు.. లక్షలాది అభిమానులకు కూడా స్ఫూర్తినిస్తోంది.
'వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే' అని త్రిష మరోసారి నిరూపించింది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన ట్రైనర్ మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా త్రిషలాగే ఎప్పుడూ యంగ్‌గా ఉండొచ్చు.మొత్తం మీద, 'లియో' బ్యూటీ లేటెస్ట్ ఫిట్నెస్ అవతార్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్రిష డెడికేషన్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు!