
భారత దిగ్గజ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) కన్నుమూశారు. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ నుంచి భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ జట్టుకు హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న జస్పాల్ రాణా, ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్‌తో పాటు పలువురు భారత షూటర్లకు శిక్షణ ఇచ్చారు.జస్పాల్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జస్పాల్ రాణా మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటు. షూటింగ్లో సాధించిన అసాధారణ విజయాలతో దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. క్రీడల పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రతిభను వెలికితీయాలనే తపన అందరి ప్రశంసలు పొందాయి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని తన సందేశంలో తెలిపారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ పేర్కొన్నారు.ఆటగాడిగా జస్పాల్ రాణా అత్యంత విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు ఎడిషన్లలో పాల్గొని మొత్తం 15 పతకాలు సాధించారు. వీటిలో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య