
How To Update PAN Card: కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా పాన్ కార్డు కూడా ప్రతి ఒక్కరి వద్ద ఉండటం చాలా ముఖ్యం. ఆదాయాన్ని ధ్రువీకరించడానికి పాన్ కార్డు కూడా అవసరం. మీ పాన్ కార్డులో పేరు, పుట్టిన
తేదీ, అడ్రస్ లేదా మొబైల్ నెంబర్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి వస్తే, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. దాని పూర్తి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకింగ్ లావాదేవీలు, ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ లేదా ప్రభుత్వ ఆర్థిక సేవలు పొందాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను ఇతర పెట్టుబడులకు సంబంధించిన పనుల కోసం ఆధార్ మాదిరిగానే పాన్ కార్డు కూడా ఉండాల్సిందే.
ఒకవేళ మీ పాన్ కార్డులో ఏదైనా సమాచారాన్ని మార్చాలనుకుంటే, ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంది. మీ పేరు, ఫోన్ నెంబర్, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను సులభంగా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు.
అయితే, దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం టాక్స్, ఆర్థిక సేవలను పొందడానికి ఓటీనీ (OTP) వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. కాబట్టి, మీ రిజిస్టర్డ్ నెంబర్ అందుబాటులో ఉంటేనే మీరు ఆన్లైన్ సేవలను సులభంగా వాడుకోగలరు.
మొబైల్ నెంబర్ మారినప్పుడు మీరు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. మన దేశంలో ప్రధానంగా NSDL, UTIITSL వంటి సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకంతో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ పాన్ కార్డు అప్డేట్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. NSDL అధికారిక వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ ట్రాక్ చేయవచ్చు. వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ స్టేటస్ సులభంగా కనిపిస్తుంది.