
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్
నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జూన్ 13, 2026 నుంచి ప్రారంభం కానుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులతో పాటు 24 ఫార్మసిస్ట్, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 529 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHC), ప్రభుత్వ ఆసుపత్రులు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICU), జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల వంటి వివిధ విభాగాలలో నియమించనున్నారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం (11వ తేదీ) వెలువడిన ఈ ప్రకటన ప్రకారం, అర్హులైన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు మరియు ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను సందర్శించాలని అధికారులు సూచించారు.