
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPFO Updates: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులను ఉద్దేశించి అనేక స్కీములను అమలు చేస్తోంది అందులో అత్యంత ముఖ్యమైనది 7 లక్షల రూపాయల వరకు అందించే ఉచిత బీమా సౌకర్యం. ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద అందుబాటులో ఉన్నటువంటి ఈ స్కీం కింద ఉద్యోగులకు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే బీమా సౌకర్యం లభిస్తుంది. దురదృష్టవశాత్తు ఎవరైనా ఉద్యోగి చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులకు ఏడు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి తద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది.
ఈడీఎల్ఐ (EDLI) స్కీం గురించి తరచూ అడిగే ప్రశ్నలు ఇవే..
ప్రశ్న: ఈడీఎల్ఐ (EDLI) స్కీం కింద ఎంత బీమా మొత్తం లభిస్తుంది..? జవాబు: ఈడీఎల్ఐ (EDLI) స్కీం కింద లభించే కనీస బీమా మొత్తం: రూ. 2.5 లక్షలు. గరిష్ట బీమా మొత్తం రూ. 7 లక్షలు (గతంలో ఇది రూ. 6 లక్షలుగా ఉండేది, 2021లో రూ. 7 లక్షలకు పెంచారు).
ప్రశ్న: ఈడీఎల్ఐ (EDLI) స్కీంలో ప్రీమియం ఎవరు చెల్లించాలి..? ఎంత చెల్లించాలి...? జవాబు: ఉద్యోగి తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి పనిచేసే సంస్థ యాజమాన్యం మాత్రమే ఉద్యోగి బేసిక్ జీతం + డీఏ (DA) లో 0.5% మొత్తాన్ని (గరిష్టంగా నెలకు రూ.75) ఈడీఎల్ఐ ఫండ్‌కు ప్రీమియంగా చెల్లిస్తుంది.
ప్రశ్న: కనీస బీమా (రూ. 2.5 లక్షలు) పొందాలంటే నియమం ఏంటి..? జవాబు: కనీస బీమా రూ. 2.5 లక్షలు హామీగా పొందాలంటే, సదరు ఉద్యోగి మరణించడానికి ముందు కనీసం 12 నెలల పాటు నిరంతర సర్వీసులో (ఒకే సంస్థలో లేదా వేరే సంస్థలకు మారినా సరే) ఉండి తీరాలి.
ప్రశ్న: బీమా మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు? జవాబు: ఈ బీమా మొత్తాన్ని కింద పేర్కొన్న ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. ఉద్యోగి చనిపోవడానికి ముందు ఉన్న 12 నెలల సగటు బేసిక్ జీతం × 35 + పీఎఫ్ ఖాతాలో ఉన్న సగటు బ్యాలెన్స్‌లో 50% (ఇది గరిష్టంగా రూ. 1.75 లక్షలు బోనస్‌గా ఇస్తారు). ఈ ఫార్ములా ప్రకారం లెక్కించినప్పుడు వచ్చే మొత్తం గరిష్టంగా రూ. 7 లక్షలకు మించదు. (ఇక్కడ సగటు బేసిక్ జీతాన్ని గరిష్టంగా రూ.15,000 గా మాత్రమే పరిగణిస్తారు).
ప్రశ్న: ఈ బీమా ఎప్పుడు వర్తిస్తుంది? జవాబు: ఉద్యోగి సర్వీసులో ఉండగా సహజ మరణం, అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు మరణించినా సరే ఈ బీమా వర్తిస్తుంది.
ప్రశ్న: ఈడీఎల్ఐ (EDLI) బీమాను ఎవరు క్లెయిమ్ చేయవచ్చు? జవాబు: ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో పేర్కొన్న నామినీ లేదా నామినీ లేకపోతే చట్టపరమైన వారసులు మాత్రమే క్లెయిం చేసుకోవాలి.
ప్రశ్న: ఈడీఎల్ఐ (EDLI) స్కీం కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి..? జవాబు: ఫారం - 5 IF ఆఫ్‌లైన్‌లో అయితే. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం. నామినీ క్యాన్సిల్డ్ చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డ్.
ప్రశ్న: సెటిల్మెంట్ సమయం ఎన్ని రోజులు పట్టవచ్చు.. జవాబు: అన్ని పత్రాలు సరిగ్గా సమర్పిస్తే, ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం గరిష్టంగా 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలి.
ప్రశ్న: ఈ-నామినేషన్ చేయించుకోవాలా..? జవాబు: బీమా క్లెయిమ్ ప్రక్రియ వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే ప్రతి ఈపీఎఫ్ సభ్యుడు తమ UAN (Universal Account Number) మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ఈ-నామినేషన్ (E-Nomination) తప్పనిసరిగా పూర్తి చేయాలి. పెళ్లి తర్వాత లేదా కుటుంబ సభ్యుల్లో మార్పులు జరిగినప్పుడు నామినీ వివరాలను అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.