
Cockroach Janata Party : దేశ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో సరికొత్త పంథాతో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తమ నిరసన సెగను భాగ్యనగరానికి విస్తరించనుంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఈ
పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ‘హిందూ-ముస్లిం’ మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని ఆయన హితవు పలికారు. పుణే విజయవంతం కావడంతో, ఈ నిరసనల సిరీస్‌లో భాగంగా జూన్ 14న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
Read Also : తనపై ఉన్న కేసులు మీనాక్షికి తెలియవా: అర్వింద్
ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ లద్దాఖ్ సామాజిక ఐకాన్, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుణే నిరసనల్లో నేరుగా పాల్గొన్న ఆయన.. విద్యారంగంలో జరుగుతున్న లోపాలు, పరీక్షల వివాదాలను ప్రస్తావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ సిరీస్ షెడ్యూల్‌ను CJP విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 12న లక్నో, జూన్ 13న అమృత్సర్, జూన్ 14న హైదరాబాద్, జూన్ 15న జైపూర్ నగరాల్లో నిరసనలు జరగనున్నాయి. ఇక ఈ సుదీర్ఘ పోరాటాన్ని జూన్ 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ప్రదర్శనతో ముగించనున్నారు. విద్యార్థుల హక్కులు, ఉపాధి, మరియు దేశ సమగ్రత కోసం సాగుతున్న ఈ విచిత్ర నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
US Attack Iran : ఇరాన్ కు ట్రంప్ బిగ్ వార్నింగ్
US Attack : అమెరికా అటాక్ లో వైజాగ్ వాసి మృతి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Canada social media ban under 16: కెనడాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
Opendoor Lays Offs: భారతీయ ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్
Strait of Hormuz : అన్ని రకాల నౌకల ప్రయాణానికి పూర్తిగా మూసివేసిన ఇరాన్
Indian crew ship attack: ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి!