మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో
రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా మేకర్స్ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు. దీంతో సినిమాకి సంబంధించి ఓ కీలకమైన విషయం రివీల్ అయిపోయింది.ఇటీవలే తమిళనాడులోని పొల్లాచ్చిలో #ChiruBobby2 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం ఈ హై-ఎనర్జీ షెడ్యూల్ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిరంజీవి, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని, బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మరిన్ని ఉత్తేజకరమైన అప్డేట్లు త్వరలో రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు.‘మెగా 158’ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే వెల్లడించారు. అయితే ఇప్పుడు మేకర్స్ పోస్ట్ చేసిన ఫోటోలలో చిరంజీవి, అనశ్వరతో పాటుగా హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా కనిపించారు. దీంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆమె ఈ ప్రాజెక్టులో భాగమయ్యారనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఈ ఫోటోల్లో నివేదా కనకాంబరాలు పెట్టుకొని, చీర ధరించి చాలా సింపుల్ గా ఉన్నారు. సినిమాలో ఆమె రోల్ ఏంటనే ఆసక్తి అందరిలో మొదలైంది.చిరంజీవి కోసం దర్శకుడు బాబీ కొల్లి భారీ స్థాయిలో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. మెగాస్టార్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రైటర్స్ గా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం డైలాగ్స్ రాస్తున్నారు.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది ఆయనకు తెలుగులో తొలి చిత్రం. దీనికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. త్వరలోనే మేకర్స్ కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తారేమో చూడాలి.