
ఇంటర్నెట్ డెస్క్: దేశ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (public sector banks) ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు గానూ ఎనిమిది బ్యాంకులు కొత్తగా 13,223 ఉద్యోగ
నియామకాలు చేపట్టాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 6,14,980గా ఉండగా.. 2025-26 మార్చి 31 నాటికి ఆ సంఖ్య 6,28,203కు చేరింది.
గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగ నియామకాల్లో ఎస్బీఐ 8,905 ఉద్యోగులను నియమించింది. దీంతో ఆ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,36,226 నుంచి 2,45,131కు చేరింది. బ్యాంకు ఆఫ్ బరోడా-1,685, బ్యాంకు ఆఫ్ మహారాష్ర్ట - 1,005, కెనరా బ్యాంకు-567, పంజాబ్ నేషనల్ బ్యాంకు -527, బ్యాంక్ ఆఫ్ ఇండియా -446, ఇండియన్ బ్యాంక్ -153 మంది చొప్పున ఉద్యోగులను నియమిచుకున్నాయి. బ్యాంకు కార్యకలాపాలు ఓ వైపు డిజిటలైజేషన్, ఆటోమేషన్ అవుతున్నప్పటికీ.. ఆయా బ్యాంకుల విస్తరణ నేపథ్యంలో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.