
హైదరాబాద్: ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన కేసులో చేపట్టిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది
. హైదరాబాద్‌లో ఐదుచోట్ల తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. నిందితులు రాజ్ కెసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, విజయనర్సింహారెడ్డి, వల్లు సందీప్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడి ఇళ్లలో సోదాలు చేసినట్లు వెల్లడించింది. నిందితులు ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. నిందితులు, వారి అనుచరులు అక్రమంగా ఆర్థిక లాభాలు పొందినట్లు గుర్తించింది.
సోదాల్లో శ్రీ సుదర్శన్ ఫర్మ్‌కు రూ.73 కోట్లు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి రూ.15 కోట్ల నగదు బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేరిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. మద్యం రవాణా టెండర్లో సిగ్మా సప్లయి చైన్ సొల్యూషన్స్ ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. రవాణా ఆదాయంలో 95-96% సిండికేట్‌కు, కేవలం 4% సిగ్మాకు వెళ్లినట్లు గుర్తించింది. కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఖరీదైన రెండు రోలెక్స్ వాచ్‌లు, కారు, మొబైల్, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కాపీని ఈడీ సీజ్ చేసింది. ఈ కేసులో గురువారం రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయవాడలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయంగా మారాయి.
రేషన్ కార్డు కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఒక్కరోజులోనే పరిష్కారం చూపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.