
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఈ ప్రమాదాలు తప్పవా?మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఈ ప్రమాదాలు తప్పవా? 11 June 2026 TV9 Telugu TV9 Telugu బంగాళాదుంపల్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిపై చిన్న చిన్న
మొలకలు రావడం, క్రమంగా అవి పెద్దవవడం గమనిస్తుంటాం
అయితే చాలామంది ఆ మొలకల్ని తొలగించి వండుకుంటారు. కానీ అది ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు
ఆ మొలకల్లో ఉండే కొన్ని రకాల విషపదార్థాలు కడుపులోకి చేరితే వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు.. వంటి సమస్యలొస్తాయట
అందుకే మొలకెత్తిన దుంపల్ని పక్కన పెట్టేయడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇవి మొలకలు రావడానికి వెలుతురు, వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయడమే కారణమట
అదే చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లో దుంపల్ని నిల్వ చేయడం వల్ల వాటిపై మొలకలు రాకుండా నివారించచ్చంటున్నారు నిపుణులు
సాధారణంగా మొలకెత్తిన గింజల్ని పచ్చిగానే తీసుకోవడం మనకు అలవాటు. కొంతమంది వీటితో వివిధ రకాల వంటకాలు తయారుచేసుకొనీ తీసుకుంటారు
అయితే కొన్ని రకాల మొలకల్ని పచ్చిగా తినకూడదు. ముఖ్యంగా చిక్కుళ్లు, ఆల్ఫాల్ఫా గింజల మొలకలు పచ్చిగా తీసుకోవడం వల్ల కొంతమందిలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందిస
ఈ మొలకల్ని పచ్చిగా కాకుండా బాగా ఉడికించుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడవచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి