ఉదయం పూట స్నానం చేయడం మంచిదా? రాత్రి పూట స్నానం చేయడం మంచిదా? అనేది ఎప్పటికీ తేలని విషయం. అయితే దీనికి సమాధానం తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. ఇది పూర్తిగా మన అలవాట్లు, లైఫ్‌స్టైల్‌పై ఆధారపడి
ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సమాధానం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఉదయం స్నానం చేయడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే రోజంతా తాజాగా ఉంటుంది. ఇక రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే చెమట, కాలుష్యం, సన్‌స్క్రీన్, పర్యావరణంలోని దుమ్ముధూళి తొలిగిపోతాయి. ఉదయం పూట స్నానం చేయడం వల్ల ప్రయోజనాలుఉదయం స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. నిద్ర మత్తు వదిలిపోతుంది. రాత్రిపూట పట్టిన చెమట అంతా శుభ్రంగా తొలగిపోతుందని NLM అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా.. శక్తి పెరుగుతుంది రక్తప్రసరణ మెరుగువుతుంది ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది శరీర దుర్వాసన తగ్గుతుందిసాయంత్రం స్నానం చేయడం వల్లరాత్రిపూట గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది రోజంతా పడిన శ్రమ నుంచి ఉపశమనం పొందే సమయం ఆసన్నమైందని మెదడుకు సంకేతం పంపుతుంది. దీనివల్ల పగటిపూట శరీరంపై చేరిన మురికి, ధూళి అంతా కొట్టుకుపోయి చక్కటి శుభ్రతతో ప్రశాంతంగా నిద్రపోవచ్చని NLM అధ్యయనం పేర్కొంది. అలాగే.. ఒత్తిడి తగ్గుతుంది హాయిగా నిద్రపడుతుంది శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల మంచి పోషణ అందుతుంది.ఉదయమా? సాయంత్రమా? ఎలా డిసైడ్ కావాలంటే..ఉదయం పూట స్నానం చేయాలా లేదా రాత్రిపూట చేయాలా అనేది నిర్ణయించుకోవడానికి మీ లైఫ్ స్టైల్, షెడ్యూల్, అవసరాలను ఒకసారి పరిశీలించుకోవాలి. రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే రాత్రిపూట స్నానం చేయడం ఉత్తమం. అలా కాకుండా ఉదయాన్నే వ్యాయామం చేసే వాళ్లు, ఆఫీస్‌కి వెళ్లేవారు ఉదయం పూట స్నానం చేయడం ఉత్తమం. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయడం మంచిది. అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మంచిది కాదు అని, భోజనం చేసిన గంట లేదా గంటన్నర తర్వాత స్నానం చేయడం మంచిది అని చెబుతారు. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.