
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి
Jun 11 2026 6:39 PM | Updated on Jun 11 2026 7:19 PM
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు తాత్కాలికంగా జట్టును వీడాడు.
రెండో టెస్ట్ జూన్ 17న మొదలు కావాల్సి ఉండగా.. ఆ సమయానికంతా అతడు జట్టుతో కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాన్వే తన తొలి సంతానం జనన సమయంలోనూ ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌ను మిస్ అయ్యాడు. ఒకవేళ కాన్వే రెండో టెస్ట్ సమయానికి అందుబాటులోకి రాకపోతే కెప్టెన్ టామ్ లాథమ్‌తో కలిసి రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తి కాగా, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో (1) విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో (41) పర్వాలేదనిపించాడు. కాన్వే ఇటీవలికాలంలో బ్యాటింగ్‌లో స్థిరత్వంలేక ఇబ్బందిపడుతున్నాడు. ఓ సిరీస్‌లో రాణిస్తే, మరో సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 452 పరుగులతో సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ మ్యాచ్ గెలిచిన ఆనందంలో వారిద్దరు నిబంధనలు ఉల్లంఘించి నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడు ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు.
అక్కడ స్టోక్స్ తాగిన మత్తులో సదరు రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈసీబీ.. స్టోక్స్, అట్కిన్సన్ నిబంధనలు ఉల్లంఘించారని నిర్దారించి వారిని రెండో టెస్ట్ నుంచి తప్పించింది. స్టోక్స్ గైర్హాజరీలో రూట్‌ను తాత్కాలిక సారధిగా ప్రకటించింది.
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..