
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-ఎతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ నిర్ణీత 49 ఓవర్లలో 349/9 పరుగులు చేసింది. వర్షం కారణంగా అఫ్గాన్-ఎ
ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించి.. టార్గెట్‌ను 294గా నిర్ణయించారు. అఫ్గాన్-ఎ 25.5 ఓవర్లకు 177/2 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో డీఎల్ఎస్ విధానం ప్రకారం 4 పరుగుల తేడాతో అఫ్గాన్-ఎ విజయం సాధించింది. ఇమ్రాన్ 75*, బహీర్ షా 51*, హసన్ 34 రన్స్ చేశారు. భారత-ఎ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ చెరో వికెట్ తీశారు. భారత్-ఎపై అఫ్గాన్-ఎ విజయం |