
మాజీ ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఒక బొద్దింక (కాక్రోచ్) లాంటి వారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే 'హిట్'తో గట్టిగా కొట్టి సమాధానం చెప్పారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత కూడా జగన్కు లేదని ఆయన మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. మెగా డీఎస్సీపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తీవ్ర అక్రమాలకు పాల్పడిన జగన్ ఇవాళ నీతులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. అమరావతి నిర్మాణం కోసం 2014 నుండి కన్న కలలను నాశనం చేయడానికే జగన్ విషప్రచారం చేస్తున్నారని, ఆయన ఇప్పుడు రోడ్లపైకి వస్తే ప్రజలు కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రికార్డు సమయంలో పూర్తి చేసిన మెగా డీఎస్సీపై జగన్ రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలు 16 వేల నిరుద్యోగ కుటుంబాల ఉసురు పోసుకోవడమేనని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. "12 ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూసి, రాత్రింబగళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలపై జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. గొడ్డలి పార్టీ నేతల తప్పుడు ఆరోపణల వల్ల డీఎస్సీ అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. వారి ఉసురు జగన్కు తగలకుండా పోదు" అని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఆధారాలతో సహా వివరణ ఇస్తున్నా, జగన్ అవే అబద్ధాలను పదేపదే ప్రచారం