
ప్రాణాలను కాపాడే గొప్ప సేవల్లో రక్తదానం ఒకటి. ప్రమాదాల్లో గాయపడిన వారు, క్యాన్సర్ రోగులు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే
రక్తదానం వల్ల కేవలం దాన్ని పొందేవారికే కాదు, దాతకూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.ఐరన్ స్థాయులు నియంత్రణలోశరీరానికి ఐరన్ చాలా అవసరం. ఇది హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అవసరానికి మించి పేరుకుపోతే అవయవాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల అదనపు ఐరన్ కొంత మేర బయటకు వెళ్లిపోతుంది. దీంతో శరీరంలో ఐరన్ బ్యాలెన్స్ కాపాడటానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యానికి దోహదంరక్తదానం గుండె ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తంలో ఐరన్ తగ్గడం వల్ల రక్తనాళాలపై ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రక్తం కొద్దిగా పలుచబడటంతో రక్తప్రసరణ సులభమవుతుంది. అయితే గుండె జబ్బులను పూర్తిగా నివారిస్తుందని చెప్పడానికి ఇంకా తగిన ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.కాలేయానికి ఉపశమనంశరీరంలో అదనపు ఐరన్ ఎక్కువగా కాలేయంలోనే నిల్వ ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో కాలేయంపై ఒత్తిడి పెంచవచ్చు. రక్తదానం ద్వారా ఐరన్ లెవెల్స్ నియంత్రణలో ఉంటే కాలేయ ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఉచిత ఆరోగ్య పరీక్ష లాంటిదేరక్తదానం చేసే ముందు కొన్ని ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, పల్స్రేట్ను పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో