
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Supreme Court on Women: ఒక చారిత్రాత్మక తీర్పులో.. గృహిణి పాత్రను కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆమె కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, రోడ్డు ప్రమాదంలో మరణించిన గృహిణి కుటుంబానికి నష్టపరిహారాన్ని లెక్కించేటప్పుడు, ఆమె అందించే గృహ సేవలు, సంరక్షణ నష్టాన్ని నష్టపరిహారంలో ఒక స్వతంత్ర మరియు ప్రత్యేక అంశంగా గుర్తించాలి.
న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం, ఒక గృహిణి అందించే గృహ సేవలకు కనీస ఆర్థిక విలువ నెలకు రూ. 30,000 ఉండాలని తీర్పు ఇచ్చింది. ఈ భావనను న్యాయస్థానం గృహ సంరక్షణ నష్టం అని పేర్కొంది. 25 ఏళ్ల నాటి మోటారు ప్రమాద పరిహార కేసులో ఈ తీర్పు వెలువడింది. న్యాయమూర్తి సంజయ్ కరోల్ ఈ తీర్పును ఇచ్చారు.
అసలు విషయం ఏమిటి? ఈ కేసు హర్యానాలోని సిర్సా జిల్లాకు చెందినది. 2001 నవంబర్ 25న.. ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ మహిళ ఫతేహాబాద్‌కు ప్రయాణిస్తోంది. మృతురాలి కుటుంబం సిర్సాలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నుండి నష్టపరిహారం కోరింది. డిసెంబర్ 2003లో, ట్రిబ్యునల్ కేవలం రూ. 2.42 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. తర్వాత ఆ కుటుంబం పంజాబ్ హర్యానా హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. దాదాపు 20 సంవత్సరాల పాటు కేసు పెండింగ్‌లో ఉన్న తర్వాత, డిసెంబర్ 2004లో హైకోర్టు నష్టపరిహారాన్ని రూ. 8.43 లక్షలకు పెంచింది. అయినప్పటికీ, ఆ కుటుంబం సంతృప్తి చెందక సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2024 డిసెంబర్ 11న, పంజాబ్, హర్యానా హైకోర్టు ఏకసభ్య న్యాయమూర్తి నష్టపరిహారాన్ని రూ. 8,43,400కు పెంచి... క్లెయిమ్ పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుండి 7.5 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా చెల్లింపు జరగకపోతే వడ్డీ రేటు 9 శాతానికి, ఆరు నెలలు దాటితే వడ్డీ రేటు సంవత్సరానికి 12 శాతానికి పెరుగుతుందని కూడా హైకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే.. ఇంటిని సమర్థవంతంగా నడిపించే మహిళలు కేవలం గృహిణులు కాదని.. వారు నిజమైన దేశ నిర్మాతలు అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సాధారణంగా మహిళలు ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే వంట, ఇంటిపనులు, పిల్లల సంరక్షణ వంటి పనులను ఎవరూ గుర్తించరని.. కానీ వాటి వెనక ఉండే శ్రమ, త్యాగమే దేశ ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి గట్టి పునాది వంటిదని కోర్టు స్పష్టం చేసింది. ఇంట్లో చేసే పనులకు జీతం లభించదు..అయినప్పటికీ ఆ శ్రమకు ఉన్న గౌరవం, విలువ మార్కెట్లో వేతన ఉద్యోగాలు చేసేవారి కంటే ఏమాత్రం తక్కువ కాదంటూ కోర్టు పేర్కొంది.
సంపాదించే వ్యక్తిపై ఆధారపడిన మహిళ లేకుండా కుటుంబం నడవలేదనేది విడ్డూరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజానికి సంపాదించే సభ్యులే గృహిణిపై ఆధారపడి ఉంటారు. బిడ్డకు మొదటి గురువు తల్లి అని కోర్టు పేర్కొంది. వారి విలువలు, సామాజిక ప్రవర్తన, క్రమశిక్షణ, సున్నితత్వం, భవిష్యత్తు అన్నీ ఇంటిలోనే రూపుదిద్దుకుంటాయి. అందుకే గృహిణులు పరోక్షంగా దేశ నిర్మాణానికి దోహదపడతారు. ప్రతి విజయవంతమైన వ్యాపారవేత్త, రాజకీయవేత్త, కళాకారుడు, న్యాయవాది లేదా రోజువారీ కూలీ విజయం ఒక గృహిణి లేదా ఇంటి పనులు చేసే మహిళ కృషి వల్లే సాధ్యమైందని తీర్పులో పేర్కొనది. అందుకే ఈ అదృశ్య శ్రమ ను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. గృహిణులే నిజమైన దేశ నిర్మాతలు అని న్యాయస్థానం నిస్సందేహంగా పేర్కొంది.
వివిధ అధ్యయనాలను ఉటంకిస్తూ.. భారతదేశంలో 15 నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలు రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ సమయం వేతనం లేని గృహ పనులలో గడుపుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. పురుషుల కంటే మహిళలు సుమారు 2.6 రెట్లు ఎక్కువ గృహ, సంరక్షణ పనులు చేస్తారు. మహిళలు చేసే ఈ వేతనం లేని శ్రమ భారతదేశ జీడీపీకి సుమారు 15 నుండి 17 శాతం వరకు దోహదపడుతుందని, కానీ దీనికి ఎటువంటి ఆర్థిక గుర్తింపు లభించడం లేదని కూడా కోర్టు పేర్కొంది.
మరణించిన మహిళ అల్లిక, కుట్టుపని ద్వారా నెలకు రూ. 3,000 సంపాదించేదని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కానీ దీనికి ఎలాంటి పత్రరూప ఆధారాలు లేవు. ఆమె తన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఒంటరి చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అందువల్ల, సుప్రీం కోర్టు ఆమెను పూర్తికాల గృహిణిగా పరిగణించి, ఆమె నెలసరి ఆదాయాన్ని రూ. 30,000గా నిర్ణయించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.