నార్వేలో నివసిస్తున్న ఒక భారతీయ ఉద్యోగికి తన వృత్తిపరమైన జీవితంలో ఎదురైన వింత అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. వారాంతంలో ఈమెయిల్‌కు స్పందించి, అదనపు గంటలు పనిచేసినందుకు తన
నార్వే మేనేజర్ మందలించారంటూ ఆయన పంచుకున్న కథనం, భారత్ మరియు స్కాండినేవియా దేశాల మధ్య పని సంస్కృతిలో ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతోంది.సుమారు 15 ఏళ్ల క్రితం నార్వేకు వలస వెళ్లిన వినోద్ అనే వ్యక్తి, ఈ అనుభవాన్ని జూన్ 10న సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత్‌లో సాధారణంగా ఉండే తీవ్రమైన పని ఒత్తిడికి ఆయన అలవాటు పడ్డారు. సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించడం, ఆలస్యంగా కార్యాలయంలో గడపడం వంటివి వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనంగా భావించే సంస్కృతి నుంచి రావడంతో, నార్వేలోనూ అదే ధోరణిని కొనసాగించారు.అయితే, ఒక సెలవు రోజు కార్యాలయం నుంచి వచ్చిన ఈమెయిల్‌కు స్పందించినందుకు, అలాగే ప్రాజెక్ట్ పూర్తి చేసే క్రమంలో తన సెలవును రద్దు చేసుకోవాలని భావించినందుకు ఆయనకు మేనేజర్ నుంచి ప్రశంసలు దక్కలేదు. పైగా, ఆయనను పిలిపించి మందలించడం గమనార్హం. ఇలా అదనపు గంటలు పనిచేయడం వల్ల నూతన ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు వెళతాయని, సెలవులు తీసుకోవడం ఐచ్ఛికం కాదని, ఉద్యోగి శ్రేయస్సు దృష్ట్యా అవి తప్పనిసరి అని మేనేజర్ స్పష్టం చేశారు."ఎక్కువ సమయం పనిచేసినందుకు నన్ను మందలించారు. ఆ మాటలు నన్ను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. ఇదే మన దేశంలో అయితే వృత్తి పట్ల అంకితభావంగా పరిగణించేవారు" అని వినోద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ