
ఈరోజుల్లో ఆఫీసులో లేదా వ్యాపారంలో రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు, లాభాలు రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. అయితే, దీనికి కారణం మీ ప్రతిభా లోపం కాకపోవచ్చు, పని చేసే ప్రదేశంలోని
వాస్తు దోషం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉద్యోగం చేసే ఆఫీస్ లో మనం కూర్చునే దిశ మన ఆలోచనలను, నిర్ణయాలను మరియు ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.ఉద్యోగులకు బెస్ట్ సీటింగ్ఆఫీస్ వాస్తు చిట్కాల ప్రకారం సీటింగ్ పొజిషన్‌లో చిన్న మార్పులు చేయడం వల్ల కార్యాలయంలో ఉత్పాదకత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. కార్యాలయంలో కుర్చీ వేసుకుని కూర్చున్నప్పుడు, నైరుతి (South-West) మూల నుండి ఈశాన్యం (North-East) వైపు చూసేలా ఉండటం అత్యుత్తమమైనదిగా వాస్తు శాస్త్రం చెబుతోంది.వ్యాపారంలో అధిక లాభాలు, ఉద్యోగ వృద్ధిఈ పద్ధతిని అనుసరించడం ద్వారా వ్యాపారంలో లాభాలు, ఉద్యోగ వృద్ధి మరియు పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఈ దిశలో కూర్చోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు వృత్తిపరమైన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.నైరుతి దిశ ఇచ్చే బలంఈ సీటింగ్ అమరిక వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే, నైరుతి దిశ ఇచ్చే బలం ఎంతో ముఖ్యమైనది. మీరు నైరుతి దిశలో కూర్చున్నప్పుడు, ఆ స్థానం మీకు బలమైన పునాదిని, స్థిరత్వాన్ని మరియు నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. అదే సమయంలో మీ చూపు ఈశాన్యం వైపు ఉండటం వలన సృజనాత్మకత మెరుగుపడుతుంది. ఇది మీ చుట్టూ సానుకూల శక్తిని నిరంతరం ప్రసరింపజేస్తూ, ఆఫీసు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.ఈ దిశలో కూర్చుంటే ప్రయోజనంఈ సీటింగ్ పద్ధతి ముఖ్యంగా వ్యాపారవేత్తలు, డైరెక్టర్లు మరియు సేల్స్ ప్రొఫెషనల్స్‌కు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకునే వారికి మరియు వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ దిశ ఎంతో లాభదాయకం. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది.ఆఫీస్ లో ఆగ్నేయంలో కూర్చోవలసి వస్తే ప్రతికూలతలివే, పరిహారాలిలా!పాటించాల్సిన వాస్తు సూచనలుదిశలతో పాటు మరికొన్ని ముఖ్యమైన వాస్తు సూచనలను కూడా పాటించాలి. మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వెనుక భాగంలో దృఢమైన గోడ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మీకు అదనపు రక్షణ లభించడమే కాకుండా, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే, కొన్ని విషయాలకు మాత్రం దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ వెనుక భాగంలో తలుపులు లేదా కిటికీలు లేకుండా చూసుకోవడం ఎంతో మంచిది.