
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అమరావతి వాతావరణ
కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. వీటి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటికి తోడు అరేబియా సముద్రం నుండి దక్షిణ కొంకణ్, కర్ణాటక, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.నేడు ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీరాష్ట్రవ్యాప్తంగా గురువారం (జూన్ 11) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.రేపు కూడా పలు జిల్లాల్లో అవే పరిస్థితులురుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటంతో శుక్రవారం (జూన్ 12) సైతం వర్షాల తీవ్రత కొనసాగనుంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు.భూమికి జ్వరం. మరో 3 ఏళ్లలో భూమి బద్ధలైపోతుందా? మత్స్యకారులకు వేట నిషేధం.. కొన్నిచోట్ల వడగాల్పులుతీరం వెంబడి రాకాసి గాలులు వీస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితుల కారణంగా వడగాల్పుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజలు ఈదురు గాలులు, ఎండల తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఏపీని చుట్టేసిన రుతుపవనాలు.. తెలంగాణలోకి..జలమయమైన విజయవాడ.. లోతట్టు ప్రాంతాలు అల్లాడిపోయాయి!బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓమోస్తరు నుండి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. ప్రముఖ కూడళ్లయిన బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్డుపై మోకాళ్లోతు వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులను చేపట్టారు.