
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ తయారు చేసే ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. కొత్త ఐఫోన్ వస్తుందంటే చాలు కొన్ని రోజుల ముందే ఆరా తీస్తుంటారు. కొత్తగా మార్కెట్లోకి వస్తే క్యూ కట్టి మరీ కొనేస్తారు. యాపిల్
గతేడాది తెచ్చిన ఐఫోన్ 17 సిరీస్‌కూ మంచి స్పందన లభించింది. మరీ ముఖ్యంగా నారింజ రంగులో తీసుకొచ్చిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఓ దశలో బుకింగ్‌లూ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఏడాది 18 ప్రో మ్యాక్స్ రాబోతోంది (iphone 18 pro max). ఈ మొబైల్ కోసం ఎదురుచూస్తున్న యాపిల్ ప్రియులకు షాక్. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పోలిస్తే 18 ప్రో మాక్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి ప్రో మ్యాక్స్‌లో ఆ స్థాయిలో అప్గ్రేడ్లు ఉండటం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో యాపిల్ భారీ స్థాయిలో దీని ధరలు పెంచనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.
గతేడాది ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ ధరను 1,199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. భారత్‌కు వచ్చేసరికి దాని ప్రారంభ ధర రూ.1,49,900గా యాపిల్ నిర్ణయించింది. ఈ ఏడాది రాబోయే ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర 1299 డాలర్లు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూస్తే దేశీయ మార్కెట్లో వీటి ధరలు మరింత పెరగనున్నాయి. ఈ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.9 అంగుళాల ఎల్టీపీఓ+ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాటు యాపిల్ ఏ20 చిప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు, బిగ్ బ్యాటరీతో ఈ మొబైల్ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫోన్18 సిరీస్ విడుదల వరకు ఆగాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.