
`పెళ్లి`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `చాలా బాగుంది`, `ప్రేమించే మనసు`, `ధనుష్`, `గురి`, `అయోధ్య` వంటి సినిమాలతో మెప్పించి ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు వడ్డే నవీన్. పదేళ్లలోనే ఇరవైకి పైగా
సినిమాలు చేసి మెప్పించారు. హీరోగా రాణించారు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్లో వడ్డే నవీన్ సినిమాల స్టయిల్ వేరేలా ఉంటుందని మాట్లాడుకునే వారు. అప్పట్లో పెద్ద నిర్మాత వడ్డే రమేష్ కొడుకు అయినా వడ్డే నవీన్ సొంతంగా నటుడిగా నిరూపించుకున్నాడు, హీరోగా ఎదిగాడు.
కానీ సడెన్‌గా సినిమాలకు దూరమయ్యారు. 2010లో వచ్చిన `శ్రీమతి కల్యాణం` తర్వాత హీరోగా సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో మెరిసినా ఆయనకు పెద్దగా పేరు రాలేదు. ఈ క్రమంలో పూర్తిగా సినిమాలే వదిలేశారు. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. తాజాగా ఆయన `ట్రాన్సఫర్ త్రిమూర్తులు` అనే చిత్రంలో నటించారు. దీనికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ పతాకంపై నవీన్ ఈ మూవీని నిర్మించడం విశేషం. ఈ చిత్రం జూన్ 19న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వడ్డే నవీన్.. తనకు గ్యాప్ రావడానికి, తాను సినిమాలు చేయకపోవడానికి కారణం తెలిపారు.
వడ్డే నవీన్ సినిమాలు మానేయడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పారు. ఒకటి.. ప్రారంభంలో ఆయనకు మంచి విజయాలు దక్కాయి. కానీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్స్ రాలేదు. దీంతో తనతో సినిమాలు చేస్తే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది. తన వల్ల ఎంత మంది లాస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇక సినిమాలు మానేయాలనుకున్నారట. అదే సమయంలో తనకు నచ్చిన కథలు రావడం లేదట. రెగ్యూలర్, రొటీన్ స్టోరీస్ వచ్చాయట, మనసుకు నచ్చిన స్క్రిప్ట్ లు రాలేదని, దీంతో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు వడ్డే నవీన్. మూడోది.. అభిమానులను డిజప్పాయింట్ చేయడం. చాలా సార్లు డిజప్పాయింట్ చేశానని, ఇలా ఎన్నిసార్లు డిజప్పాయింట్ చేస్తానని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడట నవీన్. సినిమా చేస్తే తనకు కాన్ఫిడెన్స్ రావాలని, అలాంటి సినిమా వస్తేనే చేద్దామని ఇన్నాళ్లు వెయిట్ చేశానని చెప్పాడు. ఇన్నాళ్లకి ఆ నమ్మకం కలిగిందని, అందుకే `ట్రాన్సఫర్ త్రిమూర్తులు` సినిమా చేశానని చెప్పాడు నవీన్.
తాను `ట్రాన్సఫర్ త్రిమూర్తులు` సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడంపై వడ్డే నవీన్ స్పందిస్తూ, తన రీఎంట్రీ ఎలివేషన్లు, యాక్షన్‌తో సినిమా చేయాలని అనుకోలేదు, అలా చేస్తే, ఆడియెన్స్ కి తాను రీచ్ కాలేదు. పెద్ద పెద్ద పాత్రలు పెట్టినా వెంటనే ఆడియెన్స్ సొంతం చేసుకోలేరు, అదే కానిస్టేబుల్ అంటే అంతా హోన్ చేసుకుంటారు. ఈజీగా వారికి కనెక్ట్ అవుతాం. తాను గతంలోనూ ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలే చేశాను, ఇప్పుడు కూడా అదే స్టయిల్లో రావాలని చెప్పి ఈ సినిమా చేశానని, సాధారణ కానిస్టేబుల్.. తన ఫ్యామిలీ కోసం ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడనేది కథాంశంతో ఈ సినిమా సాగుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు వడ్డే నవీన్.