
ఫిఫా ప్రపంచకప్ 2026 ఈ అర్ధరాత్రి తర్వాత ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మరపురాని క్షణాలు, నాటకీయ ముగింపులతో అభిమానులను అలరించే ఈ మెగా
టోర్నమెంట్, ఈసారి ఒక శకానికి ముగింపు పలకనుంది. కొన్ని దశాబ్దాలుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలిన ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన ఈ తరం మేటి క్రీడాకారుల కెరీర్లో ఇది ఆఖరి అధ్యాయం కావచ్చు. వీరిలో కొందరు ఇప్పటికే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా, మరికొందరు ఆ ఒక్క కల కోసం చివరిసారిగా పోరాడనున్నారు. ఈ నేపథ్యంలో, 2026 ప్రపంచకప్‌తో తమ కెరీర్‌కు ముగింపు పలకనున్న ఐదుగురు లెజెండరీ ఆటగాళ్లపై ఓ ప్రత్యేక కథనం.1. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించి, ఫుట్‌బాల్ చరిత్రలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నాడు లియోనెల్ మెస్సీ. ఎనిమిది సార్లు బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడికి బహుశా ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. ఖతార్‌లో తన చిరకాల కలను నెరవేర్చుకున్న మెస్సీ, ఇప్పుడు మరో చారిత్రక ఘనతపై కన్నేశాడు. 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా అర్జెంటీనాను నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో అర్జెంటీనా ప్రయాణం ఎలా సాగినా, ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా మెస్సీ స్థానం పదిలంగా ఉంటుంది.2. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన క్రిస్టియానో రొనాల్డో, ఇప్పటికీ తన దేశానికి అతిపెద్ద