
Tadipatri news: 32 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న మా పెదనాన్న జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉన్న బీడీ కార్మికులు నివసించడానికి హుస్సేనాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి స్థలాలను మంజూరు చేయించిన
పట్టణానికి దూరంగా ఉన్నాయని అక్కడ నిర్మాణాలు చేపట్టలేదని, ఆ స్థలాలను కేటాయించిన లబ్ధిదారుల కోసం తమ కుటుంబం కాపాడుతూ వస్తోందని గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటి పట్టాలను రద్దుచేసి వేరేవారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తే తాము కోర్టుకు వెళ్లి పిటిషన్ వేసి ఆ స్థలాలను కాపాడామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి పేర్కొన్నారు.
గురువారం హుసేనాపురం గ్రామపంచాయతీ పరిధిలో బీడీ కార్మికులకు ఇచ్చిన ఇంటి పట్టాలను గృహ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి లో ఉన్న బీడీ కార్మికులు మరియు పేదల స్థలాల గత 32 సంవత్సరాలు క్రితం మంజూరైన స్థలాలను తమ కుటుంబం కాపాడుతూ వస్తోందని ప్రస్తుతం ఆ స్థలంలో సుమారు నూరు మందికి ఇంటి నిర్మాణ రుణాలను మంజూరు చేసి నిర్మాణం చేపట్టేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.
Read Also : TG Politics: తొలి వర్షానికే కుదేలైన హైదరాబాద్.. సర్కార్ వైఫల్యంపై కేటీఆర్ ఫైర్
గత 32 సంవత్సరాలుగా బీడీ కార్మికులకు హుసేనాపురం గ్రామపంచాయతీ పరిధిలో మంజూరు చేసిన ఇంటి స్థలాలను రద్దుచేసి కొత్త వారికి ఇచ్చేలా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని. ఆ స్థలాలు రద్దు కాకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలతోపాటు ఇంటి నిర్మాణ పత్రాలను అందజేశామన్నారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హుస్సేనాపురం గ్రామపంచాయతీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన స్థలాల పట్టాలను రద్దు చేసి ఇతరులకు అప్పగించే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అయితే ప్రజలకు అన్యాయం జరగకుండా తాము న్యాయపోరాటం చేసి కోర్టు ద్వారా స్టే ఉత్తర్వులు తీసుకువచ్చామని వెల్లడించారు.
ప్రజల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఒక్క పట్టా కూడా రద్దు కాకుండా నిరంతరం పోరాడామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రెండు సెంట్ల స్థలంతో పాటు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. మంజూరైన వారంతా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు.
APL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Rahul Ramakrishna: రెండు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ దరఖాస్తు
TTD Updates: శ్రీవారి అన్నప్రసాదానికి ఫిక్సిడ్ డిపాజిట్లు రూ. 2500 కోట్లు
Jagan comments on Mega DSC: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!
Chandrababu Naidu: రేపు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన
ED Arrested Raj kasireddy : ఏపీ మద్యం స్కామ్‌లో సంచలనం: కింగ్ పిన్ రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ