
Turaka Kishore: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ‘జగనన్న ఇళ్ల పట్టాల’ వ్యవహారంలో భారీ మోసం వెలుగుచూసింది. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుపేదలను దగా చేశారనే ఆరోపణలపై
వైసీపీ నాయకుడు తురకా కిషోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లబ్ధిదారులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
బాధిత లబ్ధిదారులు విజయాబాబు, శ్రీనునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల కోసం వారు తురకా కిషోర్‌ను ఆశ్రయించారు. అయితే, వారి నుంచి కిషోర్ రూ. 4.50 లక్షల భారీ మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ ఇళ్ల పట్టాలను చేతిలో పెట్టాడు. బాధితులకు ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో వారు లబోదిబోమన్నారు.
Read also: APL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం
ఈ మోసంపై బాధితులు తీవ్ర ఆవేదనతో మాచర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందారెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తురకా కిషోర్ ఇచ్చినవి నకిలీ పట్టాలేనని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ వంచనకు సహకరించిన కిషోర్‌తో పాటు ఆయన బంధువు చల్లా శివపై కూడా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Tadipatri news: తాడిపత్రిలో బీడీ కార్మికులకు ఇంటి పట్టాల పంపిణీ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
APL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం
Rahul Ramakrishna: రెండు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ దరఖాస్తు
TTD Updates: శ్రీవారి అన్నప్రసాదానికి ఫిక్సిడ్ డిపాజిట్లు రూ. 2500 కోట్లు
Jagan comments on Mega DSC: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!
Chandrababu Naidu: రేపు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన