కుకు విత్ జాతిరత్నాలు షోలో కామెడీ ఓ రేంజ్లో వర్కౌట్ అవుతోంది. కుక్స్ చేసే రెసిపీలతో పాటుగా జాతిరత్నాలు చేసే కామెడీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కుక్స్ ఎలిమినేట్ అయ్యారు
. శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణ్ పడాల ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. కళ్యాణ్ అయితే కుక్ ఆఫ్ లోకి రాకముందే.. బిజీగా ఉన్నానని చెప్పి ఓ బైట్ వదిలి.. షో నుంచి తప్పుకున్నాడు. ఇక మే చివరి వారంలోనూ ఓ ఎలిమినేషన్ జరగాల్సింది. కానీ టీం లెక్కలు వేరేలా ఉన్నాయి. అయితే ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండేట్టుగా కనిపిస్తోంది. డబుల్ సర్ ప్రైజ్‌లు, షాక్స్ ఉంటాయని ముందే హింట్ ఇచ్చారు.ఇక గత వారం లవ్ థీమ్‌తో ఆకట్టుకున్న జాతి రత్నాలు ఇప్పుడు హెవెన్ అండ్ హెల్ అనే థీమ్‌తో వచ్చారు. ఇందులో మన జాతి రత్నాలు రకరకాల గెటప్పులతో వచ్చారు. హరి , ఇమ్ము, యాదమ్మ రాజు, రీతూ ఇలా అందరి గెటప్స్ అదిరిపోయాయి. ఇమ్ము గెటప్ చూసి శ్రీదేవీ అయితే ముద్దు వచ్చేస్తున్నావ్ అని పొగిడేసింది. అంతే కాకుండా ఓ ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. అయితే అడ్వాంటేజ్ టాస్కులో భాగంగా కుక్, జాతి రత్నంకి ఓ పెద్ద పనిష్మెంట్ వచ్చినట్టుగానే అనిపిస్తోంది.తప్పు చెప్పిన వారి మొహాన పిండి కొట్టాలని చెప్పారు. దీంతో హరి, ఇమ్ము, రాజు ఇలా అందరూ పిండి పట్టుకుని రెడీగా ఉన్నారు. తేజు, ఇమ్ము వచ్చినప్పుడు.. ఇమ్ముకి పనిష్మెంట్ పడుతుంది. అందరూ కలిసి ఇమ్ము మొహం మీద పిండి కొట్టేస్తారు. పవన్, హరి వచ్చినప్పుడు.. పవన్ తప్పు చెబుతాడు. కానీ పిండి మాత్రం హరి మొహాన కొడుతుంది రీతూ. తప్పు చెప్పింది పవన్.. పిండి కొట్టాల్సింది పవన్ మొహం మీద అని ప్రదీప్ అంటాడు. పవన్ మొహాన మాత్రం పిండి కొట్టకుండా ప్రేమగా అద్దుతుంది రీతూ.దీంతో రీతూ మొహాన ముందు కొట్టండి అని ప్రదీప్ అంటాడు. దీంతో అందరూ కలిసి రీతూ వెనకాల పడతారు. శుభం సినిమాలో సమంతలా యాక్ట్ చేయాలని రీతూ ప్రయత్నించింది. సమస్య అంటూ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. ఇక రీతూని స్టేజ్ మీద పరుగులు పెట్టించి మరీ మొహాన పిండి కొట్టారు. చూస్తుంటే ఈ సారి అడ్వాంటేజ్ టాస్క్ కుక్స్ కంటే జాతి రత్నాలకే ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.