
ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల హక్కుల కోసం ఉద్దేశించిన ‘పెసా’ చట్టం (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం, 1996) అమలు తీరుపై ప్రభుత్వాలను నిలదీశారు. ఈ
చట్టం క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతోందో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు కోరుతూ ఆయన దరఖాస్తులు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఉద్దేశించి తాను అడిగిన ప్రశ్నలను, ఆర్టీఐ దరఖాస్తుల డిజిటల్ కాపీలను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి నేటి వరకు, ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా పెసా చట్టం అమలుకు తీసుకున్న చర్యలపై రాహుల్ రామకృష్ణ వివరాలు కోరారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి కీలకమైన పత్రాలు, ఫైళ్లను అందించాలని తన దరఖాస్తులో పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గ్రామసభల బలోపేతం కోసం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి, వాటి కోసం ఎంత నిధులు ఖర్చు చేశాయనే అంశాలపై ఆయన దృష్టి సారించారు.గ్రామసభలు, నిధులపై కీలక ప్రశ్నలుగిరిజన ప్రాంతాల్లో గ్రామసభల ఏర్పాటు, ఆయా ప్రాంతాల సరిహద్దుల గుర్తింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు), సర్క్యులర్ల కాపీలను అందించాలని రాహుల్ తన ఆర్టీఐ దరఖాస్తులో కోరారు. 2019 నుంచి 2026 మధ్య జిల్లాల వారీగా ఎన్ని గ్రామసభలు నిర్వహించారు, వాటి హాజరు పట్టికలు, సమీక్షా నివేదికలు