
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. అమరావతి, జూన్ 11: ఏపీ మద్యం కుంభకోణం కేసులో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో మరో నిందితుడు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో కారుమూరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో విచారణను వేగంతం చేసిన ఈడీ.. ఈరోజు(గురువారం) ఉదయం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పదిచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం మరో నిందితుడిగా ఉన్న కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్