
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
NITI Aayog 11th Meeting: ఈ ఏడాది సమావేశానికి వికసిత భారత్ @2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. కేరళ ముఖ్యమంత్రి సతీషన్.. బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. విజయ్.. తన నల్లసూటులో ఈ సమావేశంల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పక్కనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. త్రిపుర సీఎం మాణిక్ సాహా, అటు పక్కన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూర్చొని ఈ సమావేశంలో పాల్గొనడం ఒకే ఫ్రేములో వీళ్లు ఉండటం చూసేవాళ్లను ఆకట్టుకుంది.
నీతి ఆయోగ్ సమావేశంలో దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి నాలుగు ప్రధానమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవిష్యత్తు కాలానికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచడం, స్థానిక ఉపాధితో పాటు వ్యవస్థాపకత ఆధారిత వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ ప్రజల ఆరోగ్యం-పోషకాహారం సంక్షేమంపై శ్రద్ధ పెట్టడం, చివరగా సమాజంలో అందరికీ సమానత్వం గౌరవాన్ని అందించడం వంటి అంశాలను నాలుగు స్తంభాలుగా తెలిపారు. దీనితో పాటు పాఠశాల విద్య, ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన నిబంధనను తీసుకువచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర సమస్యలు, సూచనలను వివరించడానికి కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించారు. ఈ సమయాన్ని పర్యవేక్షించడానికి పెద్ద స్క్రీన్లపై టైమర్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఎవరైనా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రసంగ పత్రాలు తీసుకువస్తే, వాటిని చదవడానికి సమయం సరిపోకపోతే, ఆ పత్రాలను ఆటోమేటిక్‌గా చదివినట్లుగా భావించి రికార్డుల్లోకి తీసుకుంటారు. అలాగే పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా గవర్నెన్స్ వాడకాన్ని పెంచాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు.
చిన్న పిల్లల ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల ప్రాంగణంలోకి మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.9 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోనే నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 30 వేల కొత్త కేంద్రాలను పాఠశాలలతో అనుసంధానించారు. అంగన్వాడీల మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రారంభించిన పంఖుడి పోర్టల్ ద్వారా ఎన్జీఓలు, ఎన్నారైలు, కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా సాయం అందుతోందన్నారు. ఇప్పటికే 70 వేల కేంద్రాలకు సీఎస్ఆర్ నిధుల మద్దతు లభించిందని అధికారులు వెల్లడించారు.
గడిచిన కొన్ని నెలల్లో చిన్న పిల్లల్లో పోషకాహార లోపం రేటు దేశంలో గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రశంసించింది. దీని ప్రకారం పిల్లల్లో ఎదుగుదల లోపం 2.92 శాతం నుంచి 29.73 శాతానికి పడిపోయింది. అలాగే తక్కువ బరువు ఉండే పిల్లల శాతం 14.03 నుంచి 12.23 శాతానికి, తీవ్ర పోషకాహార లోపం 4.81 శాతం నుంచి 4.07 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 19,500 పోషణ్ వాటికలు, ప్రాంతాల వారీగా అమలు చేసిన ప్రత్యేక పోషకాహార పథకాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.