
Chandrababu Naidu:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. తిరుపతి రూరల్ మండలం దామినీడులో భారీ బహిరంగ సభను
నిర్వహించనున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు తరలిరానున్నారు. ప్రభుత్వ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం.
Read also:Nellore news: నెల్లూరులో భారీ చోరీ.. రూ.10 లక్షల బంగారం రికవరీ
ఈ కీలక సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ హాజరుకానున్నారు. ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలుస్తుందో ఈ వేదిక ద్వారా నేతలు స్పష్టం చేయనున్నారు.
సభ నిర్వహణ కోసం దామినీడులో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్, ప్రజల కోసం సీటింగ్, తాగునీరు వంటి కనీస సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు. భద్రత దృష్ట్యా వెయ్యికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రెండేళ్ల సుపరిపాలన ఫలాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కూటమి నేతలు నిర్ణయించారు.
Ramagundam NTPC: తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్.. ఎన్టీపీసీకి రామగుండం థర్మల్ బాధ్యతలు?
TG Traffic Rules Awareness: నేరాల కంటే ప్రమాదాల వల్ల పోయే ప్రాణాలే ఎక్కువ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Jagan comments on Mega DSC: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!
ED Arrested Raj kasireddy : ఏపీ మద్యం స్కామ్లో సంచలనం: కింగ్ పిన్ రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
Nellore news: నెల్లూరులో భారీ చోరీ.. రూ.10 లక్షల బంగారం రికవరీ
AP Government: 15 రోజుల్లోగా మైగ్రేషన్ పూర్తి చేయాల్సిందే – ఏపీ ఆర్థికశాఖ కఠిన ఆదేశాలు!
Bhogapuram International Airport news:తుది దశకు భోగాపురం ఎయిర్పోర్ట్!
AP Data Centers: ఆంధ్రప్రదేశ్ లో 15 గిగావాట్ల డేటా సెంటర్ విద్యుత్ ప్రణాళిక