
TG Traffic Rules Awareness: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రహదారి ప్రమాదాల వలన ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిజి శిఖాగోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుశాఖ
ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ‘అరైవ్, అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రహదారి భద్రత అవ గాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో యేడాదికి సగటున 800 హత్యలు జరుగుతుంటే.. 8 వేల మంది రోడ్డు ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఇందులో అత్య ధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల రోడ్లపైనే జరుగుతున్నాయన్నారు.
Read Also : Ramagundam NTPC: తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్.. ఎన్టీపీసీకి రామగుండం థర్మల్ బాధ్యతలు?
అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడ పడం వలన వారి ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు సైతం ముప్పు తెస్తున్నారని వాపోయారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడడం అత్యంత ప్రమాదకర మన్నారు. ప్రజ లు అడిగిన పలు ట్రాఫిక్ ఉల్లంఘనల ప్రశ్నలకు ఆమె సమా ధానాలిచ్చారు. జిల్లా కలెక్టర్ కె.హై మావతి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణా ళిక కార్యక్ర మంలో ‘అరైవ్ అలైవ్ (రహదారి భద్రత) వారం రోజులు ముఖ్యమైన అంశంగా జరిగింద న్నారు.
సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల్లో సామా జిక అవగాహన కల్పించడం సైతం పోలీసుల బాధ్యత అన్నారు. అంతకుముందు రహదారి భద్రతపై అవగాహన విడియోలను ప్రదర్శించారు. కనువిప్పు బృందం ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా ప్రమాణాలు, ఉల్లంఘ నలపై ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిం చారు. అర్హులైన లబ్ధిదా రులకు డిజి చేతుల మీదుగా ఉచిత కంటి అద్దాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందించారు.
Chandrababu Naidu: రేపు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన
Real Estate Technology: ఓపెన్‌డోర్ కార్యకలాపాలు మూసివేత.. 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Ramagundam NTPC: తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్.. ఎన్టీపీసీకి రామగుండం థర్మల్ బాధ్యతలు?
Minister Sridhar Babu: ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ
Mahabubnagar News: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Good News for Sarpanches :సర్పంచులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్
TG funds mobilization: పథకాల అమలు కోసం రూ.1.3 లక్షల కోట్ల ఆర్థిక సాయంపై దృష్టి
Breakfast Scheme : విడతల వారీగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ – తెలంగాణ సర్కార్ నిర్ణయం