తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సిగ్మా’ అనే సినిమా తెరకెక్కుతోంది. అనౌన్స్మెంట్ నుంచే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు.‘సిగ్మా’ సినిమాని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ ఫుల్ క్లారిటీతో, అంకితభావం, నమ్మకంతో పనిచేశారని చెబుతున్నారు. విజయ్ వారసుడు తెరకెక్కిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. జులై నెలాఖరున జేసన్ సంజయ్ ‘సిగ్మా’ సినిమా రిలీజ్ అవుతుంటే, జూన్ మూడో వారంలో విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ వస్తే జూన్ 19వ తేదీన సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాత రెడీగా ఉన్నట్టు ఇప్పటికే తమిళ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందింది. అదే జరిగితే యాభై రోజుల గ్యాప్ లో తండ్రీ కొడుకుల సినిమాలు రిలీజవుతాయి.* రామ్ చరణ్‌కి శివన్న ముద్దు.. చిరంజీవి - రాజ్‌కుమార్ ఐకానిక్ స్టిల్ రీక్రియేట్ చేసిన వారసులు అయితే ‘సిగ్మా’ సినిమాకి దళపతి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. విజయ్ తనయుడిగా జేసన్ సంజయ్ కు మంచి ఇమేజ్ ఉంది. అతడిని స్క్రీన్ మీద జూనియర్ విజయ్ గా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటే, దానికి భిన్నంగా డైరెక్టర్ అవ్వాలని మెగా ఫోన్ పట్టుకున్నాడు
. మొన్నటి వరకూ అంతా బాగానే ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కిందో అంతా మారిపోయింది. విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత భార్యా పిల్లలు ఎక్కడా కనిపించలేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా రాలేదు. సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం ఆ మధ్య హాట్ టాపిక్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇలాంటి టైంలో తండ్రికి దూరంగా ఉంటున్న జేసన్ విజయ్ ‘సిగ్మా’ సినిమాకి అభిమానుల సపోర్ట్ ఏ మేరకు ఉంటుందనేది చూడాలి.* ‘సనాతన ధర్మం మతం కాదు’.. ఉదయనిధి స్టాలిన్‌కు యాక్షన్ కింగ్ అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్ ‘సిగ్మా’ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాని నిర్కిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూర్చగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ విభాగాలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.