
విశాఖ ఉక్కు కర్మాగారం ఘటన ఓ విషాదం. దీన్ని కూడా రాజకీయ బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు వైకాపా నేతలు. ఇలాంటి విషాద సందర్భాల్లో వీలైనంత తక్కువ మందితో వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. వైకాపా నాయకులు
మాత్రం జగన్ పర్యటన కోసం జనసమీకరణకు నానా తంటాలు పడ్డారు. మనిషికి రూ.100 ఇచ్చి, స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేని ప్రాంతాల నుంచి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదీ చదవండి: కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: మంత్రి కొల్లు రవీంద్ర