
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక సమస్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తెచ్చామని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల్లో
నమ్మకం పెరిగిందన్న ఆయన.. దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎక్కువ కాలం ప్రధానిగా ఉండే అవకాశం ఇచ్చిన దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీయేలో ఉన్న అన్ని పార్టీలకు ఈ విజయం దక్కుతుందన్న ఆయన.. దేశ రాజకీయాల్లో నేడు చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు.
‘‘కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. రూ.వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. అభివృద్ధి రేటు దారుణంగా ఉండేది. మేం వచ్చాక రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. ఇంటర్నెట్ వాడేవాళ్ల సంఖ్య 25 కోట్ల నుంచి వంద కోట్లకు పెంచాం. భారత్ 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను మార్పులను ప్రజలు బేరీజు వేసుకోవాలి. కేవలం 12 ఏళ్లలోనే ఇన్ని మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు కూడా ఆమోదించారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘‘గతంలో 370 ఆర్టికల్ అంటేనే భయపడేవారు.. మేం రద్దు చేశాం. గతంలో ఉగ్రవాదం పేరు చెబితే భయపడేవారు. మేం వచ్చాక దాడులు చేశాం. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. ‘వికసిత్ భారత్ 2047’ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. దేశంలో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మన వైపు చూస్తున్నాయి’’ అని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరికొద్ది రోజుల్లో ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ దగ్గరపడుతున్న కొద్దీ కేరళలోని సాకర్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.