ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణులు దేశ సమగ్రతకు అత్యంత ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి విభజనవాద ధోరణులు దేశ
శ్రేయస్సుకు ఏమాత్రం శ్రేయస్కరం కావని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కేవలం విభజన జరిగిన అశాస్త్రీయ విధానాన్ని మాత్రమే తప్పుబట్టానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.తొలిసారిగా ఆయన ఢిల్లీలో ఏఎన్ఐ వార్తాసంస్థ ఎడిటర్ స్మితా ప్రకాశ్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలు, పరిపాలన, వ్యక్తిగత అంశాలతో పాటు పలు జాతీయ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.సుమారు 84 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నాయకులు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో పోల్చి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం సరికాదన్నారు. గతంలో కొందరు నేతలు తనను హైదరాబాద్ రావొద్దని అన్నారని గుర్తుచేస్తూ, అదే తర్కాన్ని పాటిస్తే రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులను కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని చెప్పాల్సి ఉంటుందని, ఇటువంటి సంకుచిత రాజకీయాలు దేశానికి తగవని హితవు పలికారు. 570కి పైగా సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని పటిష్టం చేసిన చరిత్రను స్మరిస్తూ, విభజనవాదం దేశ ఐక్యతకు గొడ్డలిపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.'వీబీ జీ రామ్ జీ' పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707.21 కోట్లు కేటాయించినందుకు పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అందిన నిధుల్లో ఇది మూడో అత్యధిక