
Stock market:బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ మిక్స్డ్ క్లోజింగ్ నమోదైంది. సెన్సెక్స్ స్వల్ప లాభంతో గ్రీన్ జోన్లో నిలిచింది. నిఫ్టీ మాత్రం నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో రెండు సూచీలు పైకి
వెళ్ళినా, రోజు వెళ్తున్న కొద్దీ లాభాల స్వీకరణ పెరిగింది. దీంతో మార్కెట్ గరిష్ఠ స్థాయుల నుండి తగ్గింది. సెన్సెక్స్ 64.42 పాయింట్లు లాభపడి 73,983.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27.15 పాయింట్లు నష్టపడి 23,214.95 వద్ద ముగిసింది.
Read also: OnePlus Turbo 6X:మార్కెట్లోకి వన్ప్లస్ కొత్త సిరీస్ ఫోన్లు..ఛార్జింగ్ కష్టాలకు చెక్!
రోజు మధ్య భాగం నుండి మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్థిరాస్తి రంగంలో భారీ లాభాల స్వీకరణ జరిగింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ సూచీలు నష్టాల బాట పట్టాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ అత్యధికంగా నష్టపోయిన షేర్లుగా నిలిచాయి. మిడ్-క్యాప్ సూచీ 1.49 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.33 శాతం పడిపోవడంతో చిన్న, మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడిదారుల నమ్మకం తగ్గింది.
మార్కెట్ పూర్తిగా నష్టాల్లో పడకుండా కొన్ని రంగాలు ఆపాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల బాట పట్టాయి. నిఫ్టీ ఎఫ్ఎమ్సీజీ సూచీ ఒక శాతానికి పైగా లాభపడింది. ప్రైవేట్ బ్యాంకులు, కెమికల్ రంగాలు కూడా సానుకూలంగా ముగిశాయి. ఈ లాభాలే సెన్సెక్స్ని గ్రీన్ జోన్లో నిలిపాయని నిపుణులు చెప్తున్నారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ చదవొచ్చు
FIFA World Cup 2026:ఫిఫా ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధం.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
Nandamuri Balakrishna Birthday: బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Vegetable prices: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
OnePlus Turbo 6X:మార్కెట్లోకి వన్ప్లస్ కొత్త సిరీస్ ఫోన్లు..ఛార్జింగ్ కష్టాలకు చెక్!
Flight ticket price: విమాన టికెట్ ధరలు 10% పెంపు!
Gold Rate Today Hyderbad: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు!
Stock Market: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Blender’s Pride : ‘బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ మల్టీ-సెన్సరీ ప్లాట్ఫామ్ ఆవిష్కరణ!