
కాఫీ ప్రియులకు తీపి కబురు.. ఇక మీ గుండె సేఫ్కాఫీ ప్రియులకు తీపి కబురు.. ఇక మీ గుండె సేఫ్ 10 June 2026 TV9 Telugu TV9 Telugu మారిన జీవనశైలిలో గుండె జబ్బుల ముప్పు నానాటికీ పెరుగుతున్నది. అయితే, మనం
రోజూ తాగే కాఫీ గుండెను పదిలంగా ఉంచుతుందని సరికొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి
రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనంలో శాస్త్రవేత్తలు నిరూపించారు
బ్రిటన్కు చెందిన ‘యూకే బయోబ్యాంక్’ నుంచి సేకరించిన దాదాపు నాలుగున్నర లక్షల మంది డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు
దాదాపు పన్నెండున్నర సంవత్సరాల పాటు వీరి ఆరోగ్య అలవాట్లను, కాఫీ వినియోగాన్ని పరిశోధకులు నిశితంగా గమనించి పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు
రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం, కాఫీ తాగని వారి కంటే 20 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది TV9 Telugu
గ్రౌండ్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ లేదా డీకాఫిన్ అంటే కెఫిన్ తీసేసిన కాఫీ రకం ఏదైనా సరే, కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో అకాల మరణాల రేటు చాలా తక్కువగా ఉంది
ఇక, కాఫీలో కేవలం కెఫిన్ మాత్రమే కాదు. శరీరంలో వాపులను తగ్గించే, జీవక్రియలను మెరుగుపరిచే 100కు పైగా జీవసంబంధిత సమ్మేళనాలు ఉన్నాయని గుర్తించారు TV9 Telugu
అయితే చక్కెర, పాలు అతిగా లేకుండా బ్లాక్ కాఫీ లేదా తక్కువ మోతాదు పాలతో తీసుకుంటే ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు
మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి