
ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఫీవరే. మ్యాచులను చూసేందుకూ ‘చలో అమెరికా’ అంటూ ఫ్యాన్స్ క్యూ కట్టేశారు. భారత్ నుంచి వెళ్లే అభిమానులూ పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఈసారి 48 జట్లు కప్పు కోసం బరిలోకి దిగాయి
మరి.. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్.. ఇలా టైటిల్ ఫేవరెట్ రేసులో దూసుకుపోతున్నాయి. మరి భారత జట్టు పరిస్థితేంటి? ఒక్కసారైనా మహాసంగ్రామంలో తలపడ్డామా? అనే సందేహాలు రాకమానదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉన్నాయండోయ్..
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఆడాలంటే తొలుత క్వాలిఫై కావాలి. ప్రాంతాలవారీగా అర్హత టోర్నీలను ఫిఫా నిర్వహిస్తుంది. అందులో నుంచి వచ్చిన టీమ్‌లకు వరల్డ్ కప్‌లో ఆడేందుకు అవకాశం వస్తుంది. ఇలా 1950లోనూ భారత్‌కు ఓ ఛాన్స్ వచ్చింది. క్వాలిఫయర్స్ పోటీల నుంచి బర్మా (మయన్మార్), ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వైదొలగడంతో భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రపంచ కప్‌నకు అర్హత దక్కించుకుంది. కానీ, టీమ్ఇండియా వరల్డ్ కప్‌లో మాత్రం పాల్గొనలేదు. దానికిగల కారణాలపై వివిధ కథనాలు చక్కర్లు కొట్టాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.