
చాలామందికి ఒక్కోసారి చాక్లెట్ తినాలనే బలమైన కోరిక కలుగుతుంటుంది. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా మూడ్ బాగోలేనప్పుడు ఇది మరింత ఎక్కువవుతుంది. చాక్లెట్లో ఉండే షుగర్, ఫ్యాట్‌తో పాటు థియోబ్రోమిన్
, ఫెనిథైలమిన్ వంటి పదార్థాలు మెదడులో సెరటోనిన్, డోపమైన్ అనే ఫీల్-గుడ్ హార్మోన్లను విడుదల చేస్తాయి. అయితే, ఇలా చాక్లెట్ తినాలనిపించడం కేవలం రుచి కోసం మాత్రమే కాదు. అది శారీరక, మానసిక ఆరోగ్య స్థితికి సంకేతం. మీ శరీరంలో కొన్ని పోషకాలు తగ్గినా లేదా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినా ఈ విధమైన సంకేతాలు వస్తుంటాయి.ప్రధాన కారణాలు..మెగ్నీషియం లోపం: చాక్లెట్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు తరచూ డార్క్ చాక్లెట్ తినాలనిపిస్తే.. మీ శరీరంలో మెగ్నీషియం లోపించిందని అర్థం కావచ్చు. ఇది కండరాల విశ్రాంతికి, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం: మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా చాక్లెట్ క్రేవింగ్స్ వస్తే.. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడం లేదా శరీరంలో తక్షణ శక్తి తగ్గడం దానికి కారణం కావచ్చు.మానసిక ఒత్తిడి, ఆందోళన: తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనం లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు మెదడు తక్షణ కెమికల్ బూస్ట్ కోసం వెతుకుతుంది. చాక్లెట్ తినడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది.హార్మోన్ల మార్పులు: మహిళల్లో పీరియడ్స్ వచ్చే ముందు హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల మెదడులో సెరటోనిన్ తగ్గిపోతుంది. ఆ శారీరక, మానసిక అసౌకర్యాన్ని అధిగమించడానికి శరీరం చాక్లెట్‌ను కోరుకుంటుంది.డార్క్ వర్సెస్ మిల్క్ చాక్లెట్మీకు డార్క్ చాక్లెట్ తినాలనిపిస్తే శరీరానికి