
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Vizag Steel Plant Accident: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రావడం లేదు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయబద్దంగా రావాల్సినవే ఇస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చేది ఏంది బోడి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. '2025 ఏప్రిల్ నెలలో ఓ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుడు చనిపోతే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. చనిపోయిన కార్మికుడి పిల్లలకు ఒక్క నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే ఫైల్ పోయిందని చెబుతున్నారు' అని వివరించారు. 'చంద్రబాబు కొడుకు మాటలు వింటే ఇలాంటి మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారా అనిపించింది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
పరామర్శ స్టీల్ ప్లాంట్ బాధితులను విశాఖపట్టణంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
జీతాలు లేవు 'స్టీల్ ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారు. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానమంత్రి సభ సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నేరుగా సభలోనే కోరాను. స్టీల్ ప్లాంట్‌లో 28 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే.. 10,500 మంది కార్మికులను తీసేశారు. ఇప్పుడు కార్మికుల సంఖ్య 16 వేల మందికి పడిపోయింది. కార్మికులకు నాలుగున్నర నెలల జీతాలు లేవు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
మీరు ఇచ్చింది ఏంటి బోడి? 'ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. లిక్విడ్ బకెట్లలో పోసింది పొంగి బ్లాస్ట్ అయింది.. ఇందులో కార్మికుల తప్పులేదు. ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన సమయంలో రాజకీయ చేయడం దురదృష్టకరం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో పెద్ద డ్రామా. స్టీల్ ప్లాంట్ కర్మాగారం నుంచే రూ.25 లక్షలు ఇస్తారు.. ఇంకా మీరు ఇచ్చింది ఏంటి బోడి?' అని చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపేక్షించేది లేదు.. 'నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు రూ.కోటి పరిహారం ఇచ్చా. స్టీల్ ప్లాంట్ ఘటనలో బాధితులకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి అంతే. చంద్రబాబు చేసింది ఏమి లేదు' అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బాధితులకు చంద్రబాబు న్యాయం చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఇవ్వకపోతే మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు కోటి రూపాయలు ఇస్తానని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి 'విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు అన్ని విధాలా మేం కృషి చేశాం. అందుకే ఆ 5 ఏళ్లలో ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. రెండుసార్లు ప్రధానమంత్రికి లేఖ రాశాం. ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేశాం. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
ప్యాకేజీ పక్కదారి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. 'స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీ సాధించామని చంద్రబాబు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఆ ప్యాకేజీ ఇక్కడ నిర్వహణ కోసమో.. భద్రత మెరుగపర్చడం కోసమో.. సామర్థ్యం పెంచడం కోసమో వాడలేదు. ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, ఇంకా బ్యాంక్ రుణాలు కొంత తీర్చడం కోసం వాడారు' అని చంద్రబాబు మోసాన్ని బయటపెట్టారు.